యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అయిన కార్తీ కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్.ఈయన చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి.
అందుకే కార్తీకి తెలుగులో కూడా మార్కెట్ ఉంది.ఇక కార్తీ నాగార్జున తో కలిసి ఊపిరి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.
అందుకే ఈయనను తెలుగు హీరోలానే భావించి ఆయన సినిమాలను ఆదరిస్తారు.
ఇక ఈ మద్యే పొన్నియన్ సెల్వన్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత మరో సినిమాతో వచ్చాడు.దీపావళి కానుకగా కార్తీ ‘సర్దార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
ఈ సినిమాతో మంచి విజయం అందుకుని జోరు మీద ఉన్న కార్తీ వెంటనే మరో సినిమా ప్రకటించాడు.

ఎప్పటి లాగానే కార్తీ విభిన్నమైన సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు.ఇటీవలే ఒక కొత్త సినిమాను ప్రకటించి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.యంగ్ డైరెక్టర్ రాజు మురుగన్ తో ఈయన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేసారు.
”జపాన్” అనే టైటిల్ తో ఈ సినిమాను అనౌన్స్ చేసారు.

ఈ సినిమాలో కార్తీ జోడీగా అను ఇమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా ప్రకటించారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.కార్తీ ఈ సినిమాతో మరోసారి తన ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరచడానికి రెడీ అయ్యారట.
అప్పట్లో కాష్మోరా సినిమాకు ఎలా అయితే కొత్త మేకోవర్ ప్రయోగం చేసాడో ఇప్పుడు కూడా జపాన్ సినిమా కోసం అలాంటి కొత్త మేకోవర్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈసారి కార్తీ ఎలా ఆకట్టు కుంటాడో.







