రఘు అలియాస్ వర్శిన్ రెహ్మన్.మలయాళం సినిమా పరిశ్రమ ద్వారా వెండి తెరపై అడుగు పెట్టిన నటుడు.
తన అద్భుత సినిమాలతో మల్లూవుడ్ ను ఓ ఊపు ఊపాడు.కెరీర్ ప్రారంభించిన కొద్ది రోజల్లోనే తన నటనతో సత్తా చాటాడు.
నెమ్మదిగా తమిళంలోకి ఎంటరై అక్కడా మంచి నటన కనబర్చాడు.అటు నుంచి టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.
పలు తెలుగు సినిమాల్లో నటించి.ఇక్కడి జనాలకు మరింత దగ్గరయ్యాడు.
ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించాడు.ప్రస్తుతం తెలుగులో సపోర్టింగ్ యాక్టర్ గా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.
టాలీవుడ్ లో ఆయన పలు సినిమాల్లో నటించాడు.భారత్ బంద్, రాసలీల, సమరం, రేపటి రౌడీ, ఆలయం, గోవిందుడు అందరి వాడేలే, జనతా గారేజ్ సహా పలు సినిమాల్లో నటించాడు.
సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాదు.ఇతడి కుటుంబ సభ్యుల్లో చాలా మంది సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మన్ కి ఈయన అన్న అవుతాడు.
వీరిద్దరూ తోడల్లుళ్లు.వీరిద్దరి భార్యలు స్వయానా అక్కా చెల్లెళ్ళు.

అటు ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.వీరిలో ఒక అమ్మాయి రషితా రెహ్మన్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.మలయాళంలో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ఈమె నటించిన పలు సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి.

మొత్తంగా వర్శిన్ రెహ్మన్ ఫ్యామిలీ మలయాళం సినిమా పరిశ్రమను ఏలుతోంది.పలువురు కుటుంబ సభ్యులు సినిమా పరిశ్రమలో రాణిస్తున్నారు.సినిమాల్లోని 24 రంగాల్లో చాలా వాటిలో వీరి కుటుంబ సభ్యులు ఉన్నారు.
తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీలా. కన్నడలో అర్జున్ ఫ్యామిలీలా, తమిళ్ లో కమల్ ఫ్యామిలీలా, మలయాళంలో వర్శిన్ రెహ్మన్ ఫ్యామిలీ సినిమా రంగాన్ని శాసిస్తోంది.
చక్కటి ప్రతిభతో ముందుకు సాగుతోంది.