పీసీఓడీ..ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది.పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నారు.దీని కారణంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అధిక బరువు, సంతాన లేమి, హెయిర్ ఫాల్, మొటిమలు తదితర సమస్యలన్నీ తలెత్తుతుంటాయి.
పీసీఓడీకి( PCOD ) ఖచ్చితమైన చికిత్స లేదు.కానీ ఆహారంలో మార్పులు చేసుకోవడం, జీవనశైలిని మార్చుకోవడం, లక్షణాలు బట్టి మందులు వాడటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అయితే మీరు కూడా పీసీఓడీ బాధితులా.అయితే ఇప్పుడు చెప్పబోయే ఆహారాల జోలికి అస్సలు వెళ్ళకండి.
ఎందుకంటే ఈ ఆహారాలు పీసీఓడీని మరింత తీవ్ర తరంగా మారుస్తాయి.దాని లక్షణాలను రెట్టింపు చేస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం పీసీఓడీ ఉన్నవారు ఎవైడ్ చేయాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.పీసీఓడీ సమస్యతో బాధపడుతుంటే చక్కెరను కంప్లీట్ గా దూరం పెట్టండి.
ఏ రూపంలోనూ చక్కెరను తీసుకోకండి.

చక్కెర, చక్కెర తో తయారు చేసిన ఆహారాలు గ్లూకోజ్ స్థాయిలను పెంచడమే కాకుండా, బ్లడ్ ప్రెషర్, ట్రైగ్లిజరైడ్స్ పెంచుతుంది.ఇది ఇతర అనారోగ్యాలకు కారణమవుతుంది.అలాగే పీసీఓడీ బాధితులు సోయా, సోయా ఉత్పత్తులు( Soya food ) తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి సోయా ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
కానీ సోయా జన్యుపరమైన పరివర్తన కారణంగా ఏర్పడిన ఆహారం.దీనిలో ఫైటోస్ట్రోజెన్లు ఉంటాయి.
హార్మోన్ల సమతుల్యతకు ఇవి ప్రతికూలంగా మారుతాయి.అందువల్ల పీసీఓడీ ఉన్నవారు సోయా, సోయా ఉత్పత్తులను తీసుకోకపోవడం మంచిది.

రిఫైన్డ్ చేసిన పిండి పదార్థాలు, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్( Fast food ), ఫ్రైడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి ఆహారాల జోలికి అస్సలు పోకూడదు.ఇక ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ వంటి ఆహారాలు కూడా పీసీఓడీ ఉన్నవారు తీసుకోకపోవడమే ఎంతో ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.వీటికి బదులుగా ఆకుకూరలు, సీజనల్ దొరికే పండ్లు, నట్స్, కూరగాయలు, చేపలు, డార్క్ చాక్లెట్, పసుపు, దాల్చిన చెక్క వంటి స్పైసెస్ ను డైట్ లో చేర్చుకోవాలి.ఇవి పీసీఓడీ నుంచి బయటపడటానికి ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.