అతిగా ఎక్సర్‌సైజ్ చేస్తే సంతాన సమస్యలు వ‌స్తాయా..?

ఎక్సర్‌సైజ్.నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రి జీవ‌నంలోనూ ఒక భాగ‌మైపోయింది.

 Excessive Exercise Can Raise Fertility Problems..!!, Exercise ,fertility Problem-TeluguStop.com

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఇక క్ర‌మం త‌ప్ప‌కుండా క‌స‌ర‌త్తులు చేస్తేనే అధిక బ‌రువును అధిగమించ‌గ‌ల‌రు.

మ‌రియు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌గ‌ల‌రు.అలాగే ప్ర‌తి రోజు ఎక్సర్‌సైజ్ చేసే వారిలో గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

అంతేకాదు, డైలీ ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డం వ‌ల్ల అధిక రక్తపోటు, మధుమేహం, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటివి కూడా దూరం చేసుకోవ‌చ్చు.

అయితే ఎక్స‌ర్‌సైజ్ ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.

అతిగా చేస్తే మాత్రం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు అంటున్నారు.అందులో ముఖ్యంగా సంతాన స‌మ‌స్య‌లు.

ఇటీవ‌ల కాలంలో చాలా మంది ఈ సంతాన స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు.వాస్తవానికి పెళ్లి అనేది దాంపత్య జీవితానికి ఒక నాంది మాత్రమే.

కానీ, ఎప్పుడైతే సంతానం కలుగుతుందో.అప్పుడే వారి దాంప‌త్య జీవితం సంపూర్ణమవుతుంది.

అయితే ఈ సంతాన స‌మ‌స్య‌లు క‌ల‌గ‌డానికి ఎక్స‌ర్‌సైజ్ కూడా ఒక కార‌ణం అంటే న‌మ్ముతారా.? ఒక‌వేళ మీరు న‌మ్మ‌క‌పోయినా ఇది నిజం.

Telugu Exercise, Harmful-General-Telugu

ఏదైనా అతి చేస్తే అన‌ర్థాలే అంటారు క‌దా.అది ఈ విష‌యంలో కూడా వ‌ర్తిస్తుంద‌ని అంటున్నారు నిపుణులు.కొంతమంది ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా గంట‌లు త‌ర‌బ‌డి ఓ ఎక్సర్‌సైజ్ చేస్తూనే ఉంటారు.వాస్త‌వానికి సంతానం క‌ల‌గాలంటే శరీరంలోని కొవ్వు కూడా సాహాయ‌ప‌డుతుంది.

కానీ, ప‌రిమితిని మించి ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుంది.దీని వల్ల పిల్లలు పుట్టే అవకాశం త‌గ్గ‌పోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అందుకే పిల్ల‌లు కావాల‌నుకునే వారు ఎక్సర్‌సైజ్ చేయండి.కానీ, ఓవ‌ర్ చేయ‌కండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube