ప్రస్తుతం మారుతున్న ఈ వాతావరణం వలన ఎన్నో వ్యాధులు వస్తున్నాయి.ఇప్పుడున్న జీవనశైలి కారణంగా చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఇందులో భాగంగానే వర్షాకాలంలో( Monsoon ) అయితే రకరకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.వర్షంలో తడవడం కారణంగా జ్వరం, జలుబు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
అంతేకాకుండా దగ్గు, డెంగ్యూ లాంటి అనేక వ్యాధులు కూడా వ్యాపిస్తాయి.మారుతున్న వాతావరణం వలన చాలామంది జ్వరాల వ్యాప్తిని కూడా చూస్తున్నారు.
అందుకే ప్రజలు జ్వరం( Fever ) వచ్చిన తర్వాత తమను తాము చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.

అయితే వైద్యులను సంప్రదించి మందులు కూడా తీసుకుంటూ ఉంటారు.ఇక జ్వరం వచ్చిన స్నానం( Bath ) చేయని వారు ఉంటారు.అయితే ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే స్నానం చేయకూడదని సూచిస్తూ ఉంటారు.
అసలు జ్వరం వస్తే స్నానం చేయడం మంచిదా? చెడ్డదా? అన్న సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది.దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో చాలా మంది వైరల్ ఫీవర్ రోగులు( Viral Fevers ) కనిపిస్తూ ఉంటారు.ఎందుకంటే జ్వరం ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంటుంది.
జ్వరం తర్వాత ఒక వ్యక్తికి మళ్లీ మళ్లీ జ్వరం వస్తూ ఉంటుంది.అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో ఈ వైరల్ జ్వరం మరింత వేగంగా పెరుగుతుంది.

పిల్లల్లో, వృద్ధులలో ఈ వైరల్ జ్వరం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.అలాగే బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి కూడా వ్యాపిస్తుంది.అందుకే ఈ మారుతున్న వాతావరణంలో తమను తాము ప్రజలు జాగ్రత్తగా చూసుకోవాలి.కొంతమంది జ్వరం వచ్చిన తర్వాత స్నానం చేస్తారు.మరి కొందరు చేయరు.అయితే జ్వరం సమయంలో శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
అందుకే జ్వరం వచ్చిన తర్వాత గోరువెచ్చని నీటిలో గుడ్డ మీద శరీరాన్ని చాలా శుభ్రం చేసుకోవాలి.ఇది మన శరీరాన్ని శుభ్రపరుస్తుంది.
అలాగే మానసికంగా కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది.అందుకే జ్వరం వచ్చినప్పుడు వేడి నీటితో తుడుచుకోవడం మంచిది.