టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చి నటనలో బెస్ట్ అని అనిపించుకుంటున్నారు.మరీ ముఖ్యంగా సొంత బ్రదర్స్ కూడా ఇండస్ట్రీలో బాగానే ఉన్నారు.
అయితే సక్సెస్ విషయంలో అందరికీ ఒకే విషయం వచ్చిరాదు.కొంతమందికి విజయం నల్లేరు మీద నడక అవ్వచ్చు.
మరికొంతమందికి ప్రతి చిన్న స్టెప్ ఎంతో కష్టంతో కూడుకున్నది కావచ్చు.అలా ఇండస్ట్రీకి వచ్చిన సొంత అన్నదమ్ముల్లో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు మరీ ముఖ్యంగా అన్నలకంటే తమ్ముళ్లే పరవాలేదు అనిపిస్తున్నారు.ఇంతకీ ఇండస్ట్రీకి వచ్చిన ఆ అన్నదమ్ములు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో బాగా నడుస్తూ ఆదరి అభిమానాలు అందుకుంటున్న వారు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేవరకొండ బ్రదర్స్(Devarakonda Brothers)
టాలీవుడ్ లో మోస్ట్ క్రెజియస్ట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అని ఇట్టే చెప్పేస్తారు చాలామంది.అయితే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో పోలిస్తే ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)చాలా వరకు బెటర్ అని కొంతమంది అభిప్రాయం.క్రేజ్ ఉన్నప్పటికీ విజయ్ కన్నా కూడా ఆనంద్ కథల ఎంపికలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నాడట.అందుకే విజయ్ కన్నా ఆనంద్ చాలా బెటర్ అనేది అందరూ చెప్పే మాట.
నందమూరి బ్రదర్స్( Nandamuri Brothers)
నందమూరి ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు.అందులో ఈ జనరేషన్ లో కళ్యాణ్ రామ్, తారక్ (Kalyan Ram, Tarak)పోటీ పడి నటిస్తున్నారు.అయితే ఈ ఇద్దరిలో ఎదురు చూసిన అన్న కళ్యాణ్ కన్నా కూడా తమ్ముడు తారక్ క్రేజ్ విషయంలో, సక్సెస్ విషయంలో, సినిమాల విషయంలో చాలామంది ఉన్నారు.
మంచు బ్రదర్స్(Manchu Brothers)
మంచి ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఇద్దరు అన్నదమ్ములైన విష్ణు మరియు మనోజ్ (Manchu Vishnu, Manoj)సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చి చాలా ఎళ్లు గడుస్తుంది.అయితే నడక విషయంలో విష్ణుతో పోలిస్తే మనం చాలా బెటర్ అని కొంతమంది అభిప్రాయం.ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చాడు కానీ ఎప్పటికైనా మనోజ్ పెద్ద స్టార్ అవుతారని మంచు ఫాన్స్ అంటూ ఉంటారు.
శోభన్ బ్రదర్స్(Shobhan Brothers)
<img src="https://telugustop.com/wp-content/uploads/2024/05/Tollywood-brothers-who-are-doing-best-e.jpg“/>వర్షం సినిమా దర్శకుడు శోభన్ కుమారులైన సంగీత్ శోభన్ సంతోష్ శోభన్(Sangeet Shobhan ,Santosh Shobhan) ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అయితే సంతోష్ శోభన్ యొక్క హిట్టు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు.కానీ ఇదే సమయంలో సంగీత శోభన్ మాడ్ సినిమాతో గట్టి అరంగేట్రం చేసుకొని అనేక సినిమాలను లైన్లో పెట్టుకొని అన్న కన్నా తోపు అని అనిపించుకుంటున్నాడు.