సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి(laxmi parvati) ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తెలుగుదేశం పార్టీని నేను ఎప్పుడూ తిట్టలేదని లక్ష్మీపార్వతి తెలిపారు.
కొంతమంది చేతిలో పడి తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని ఆమె వెల్లడించారు.టీడీపీ(TDP) ఎంతోమందికి డయాస్ లా ఉపయోగపడిందని ఆమె పేర్కొన్నారు.
చివరకు టీడీపీ పనికిమాలిన వాడి చేతిలో పడిందని దిగజారుడుతనం ఉన్న వ్యక్తి చేతిలో పార్టీ పడిందని లక్ష్మీపార్వతి(laxmi parvati) పేర్కొన్నారు.చంద్రబాబుకు అదృష్టం వల్ల ఎన్టీఆర్ (Sr.
NTR)కు అల్లుడు అయ్యాడని ఆయన అల్లుడు కావడం ఎన్టీఆర్ కు దురదృష్టం అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.రాజకీయ పార్టీలలో చాలా పార్టీలు డబ్బులు లేక మూతబడ్డాయని ఆమె పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పై అభిమానంతో సైకిల్ కు (cycle)ఓట్లు పడ్డాయని ఆమె తెలిపారు.
పవన్(Pawan) అంటే ఇప్పటికీ లీడర్ అని నమ్మకం కలగదని బాబు చెప్పిన మాటలే పవన్ చెబుతారని ఆమె చెప్పుకొచ్చారు.బాబు పాలనపై పవన్ ఎప్పుడూ విమర్శలు చేయలేదని లక్ష్మీపార్వతి అన్నారు.పవన్ హీరోనే కానీ మంచి లీడర్ కాదని ఆమె తెలిపారు.
జగన్ (Jagan) పై విమర్శలు చేయడం కాదని పాలనలో లోపాలు ఉంటే చెప్పాలని లక్ష్మీపార్వతి కామెంట్లు చేయడం గమనార్హం.
సీనియర్ ఎన్టీఆర్, పార్టీకి నేను ప్లస్ అయ్యానని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నారని ఆ సమయంలో నేను చూసుకున్నానని ఆమె తెలిపారు.ఎన్టీఆర్ గారికి సంబంధించి నేను చూపించిన ఫీలింగ్ లో ప్రేమ అనేది చిన్న పదం అని ఆమె వెల్లడించారు.
లక్ష్మీపార్వతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడుపై తరచూ విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.