అయోధ్య గర్భగుడిలో.. రాముడిని చూడకుండా ఆ పూజారి ముఖం ఎందుకు కప్పుకున్నారో తెలుసా..?

ఇటీవల అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో శ్రీరాముడిని ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది.అయితే ప్రాణప్రతిష్ట రోజున అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో శ్రీరాముడిని చూడకుండా ఓ పూజారి తన ముఖాన్ని కప్పుకొని ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 Do You Know Why The Priest Covered His Face In Ayodhya Sanctum Sanctorum , Ayodh-TeluguStop.com

సోషల్ మీడియాలో దీని గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది.అయితే దీని గురించి ఓ పూజారి వివరణ ఇచ్చారు.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ( Ram Lalla Pranapritsha )వేడుక నుండి ఓ ఫోటో వైరల్ అవుతుంది.

ఈ ఆసక్తికరమైన ఫోటోలో ఉడిపికి చెందిన ప్రజావాణి విశ్వ ప్రసన్న తీర్థ ( Prajavani Vishwa Prasanna Tirtha )అనే పూజారి, ఆచారాల సమయంలో తన ముఖాన్ని కప్పుకొని కనిపించారు.

అయితే గర్భగుడిలో ఉన్న కెమెరాకు చిక్కిన ఈ సంఘటన ఆయన అలా ఎందుకు ప్రవర్తించాడు అన్న విషయంపై చర్చలకు దారి తీసింది.

అయితే ఆయన అలా ముఖాన్ని కప్పి ఉంచడానికి ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.ఇది రాముడికి పవిత్ర నైవేద్యాన్ని సమర్పించే సమయంలో జరిగింది.అయితే ఈ చిత్రం స్వామికి దైవంతో ఉన్న లోతైన సంబంధాన్ని, దేవుని పట్ల ఆయనకున్న అత్యంత గౌరవాన్ని సూచిస్తుంది.అయితే దీని గురించి ఒక ప్రముఖ పూజారి వివరించడం జరిగింది.

ఇది నైవేద్యం సమర్పించేటప్పుడు రాముని పట్ల భక్తి గౌరవానికి సంకేతం అని వారు చెప్పారు.

Telugu Ayodhyasanctum, Bhakti, Devotional, Prajavanivishwa, Purijagannath, Ramla

అయితే ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో( Puri Jagannath Temple in Odisha ) భగవంతునికి ఆహారాన్ని సమర్పించేటప్పుడు ఈ విధంగా నియమాలు పాటిస్తారని చెప్పారు.ఆహారం కలుషితం కాకుండా వారి ముక్కు, నోటిని కప్పి ఉంచుతారని తెలిపారు.అదేవిధంగా అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు పూజలు చేసి హారతి ఇచ్చారు.

ఆ తర్వాత రాముడికి అన్న ప్రసాదంతో పాటు ఇతర ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టారు.ఆ సమయంలోనే ఆ పూజారి ఇలా తన ముఖానికి కప్పుకున్నారు.

Telugu Ayodhyasanctum, Bhakti, Devotional, Prajavanivishwa, Purijagannath, Ramla

ఇది మధ్వ ఆచారం.మధ్వ ఆచారంలోనే కాకుండా మిగతా ఆచారాల్లోనూ కూడా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కళ్ళు, ముక్కు మూసుకోవడం, కొన్ని నిమిషాలు గర్భగుడి తలుపులు మూసి వేయడం ఎప్పటినుండో వస్తున్న ఆచారం అని వారు చెప్పుకొచ్చారు.అలా నైవేద్యం పెడితే ఆ ప్రసాదాన్ని దేవుడు తింటారు.అలా దేవుడు కోసం మనం పెట్టే ఆహార పదార్థాలు దేవుడు తింటున్నప్పుడు దానిపై నరదిష్టితో పాటు ఇతర ఆలోచనలు రాకూడదని ఇలా మొహానికి దుప్పటి కప్పుకోవడం నియమమని పండితులు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube