కలబంద అందం, ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ముందు ఉంటుంది.అయితే కలబంద( Aloe vera ) పేరు చెప్పగానే చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు.
కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కలబందకు ప్రాధాన్యత ఇస్తారు.ఈ మొక్క ఇంట్లో సంపద, శ్రేయస్సుకి లోటు ఉండదని చెబుతారు.
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్, జెడ్ మొక్క మాదిరిగా ఇది కూడా అదృష్టాన్ని ఇచ్చే మొక్క.అయితే ఎన్నో ఔషధగుణాలు కలిగిన మొక్క కలబంద.
కాబట్టి ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా ప్రయోజనాలను అందిస్తుంది.అయితే వాస్తు ప్రకారం కలబంద మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే చాలా పవిత్రంగా భావిస్తారు.
ఈ మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
కలబంద మొక్క సరైన దిశలో నాటడం వలన లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.అలాగే ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది.ఈ మొక్క ఇంట్లో ఉంటే కుటుంబం మొత్తం శ్రేయస్సుతో నిండిపోతుంది.
ఇక వారి కీర్తి, ప్రతిష్టలు పెరిగిపోతాయి.ఇంట్లో కలబంద మొక్కలు నాటేటప్పుడు దిశపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
అప్పుడే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చు.దీనికోసం కలబంద మొక్కను ఎప్పుడూ తూర్పు దిశలో నాటాలి.
ఈ దిశలో కలబంద మొక్క ఉంటే మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది.అలాగే ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశ( East direction )లో పెంచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది.
అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి.ఇక జీవితంలో పురోగతి, సంతోషం, శ్రేయస్సుని కోరుకుంటే పశ్చిమ దిశలో కలబంద మొక్క నాటవచ్చు.ఈ మొక్క పెట్టడం కోసం పశ్చిమ దిశ అత్యంత శుభప్రదమైనదిగా నిపుణులు చెబుతున్నారు.అయితే ఇది జీవితంలో విజయం, పురోగతికి అనేక అవకాశాలు అందిస్తుందని నమ్ముతారు.అలాగే కలబంద మొక్కను ఆగ్నేయంలో పెట్టడం వలన ఆదాయం పెరుగుతుంది.పడమర దిశలో పెడితే ఉద్యోగంలో పదోన్నతి కూడా పొందుతారు.
LATEST NEWS - TELUGU