వాస్తు శాస్త్రం ప్రకారం మన దేశంలో ఎంతో మంది ప్రజలు జీవిస్తున్నారు.చిన్న పిల్లలు( Children ) ఎప్పుడూ బాగుండాలంటే వారి దగ్గర కొన్ని వస్తువులు అస్సలు ఉంచకూడదు.
పసి పిల్లల గురించి ఎన్నో విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి.దీని ప్రకారం పసి పిల్లల దగ్గర ఉంచకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి.
ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముళ్ళ మొక్కల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
ఈ మొక్కలు అందంగా ఉంటాయి.ఇంటిని అందంగా కనిపించేలా చేస్తాయి.
అందుకే చాలా మంది ముళ్ళ మొక్కలను గార్డెన్లో పెంచుతూ ఉంటారు.కానీ వీటికి పదునైనా ముళ్ళు ఉంటాయి.ఇవి గుచ్చుకుంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు చెడు శక్తిని తీసుకుని వస్తాయి.
ఇది మీ బిడ్డను చెడు చేస్తుంది.వారిని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది.
అలాగే ప్రతి ఒక్కరి ఇళ్లలో అద్దాలు కచ్చితంగా ఉంటాయి.కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న పిల్లలను అద్దాలకు( Mirrors ) దూరంగా ఉంచాలి.
మీ పిల్లలు ఉన్న గదిలో అద్దాలను అస్సలు ఉంచకూడదు.

ఎందుకంటే గాజు శక్తిని ప్రతిబింబిస్తుంది.కాబట్టి ఇది మీ పిల్లలకు ప్రమాదం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది.ఇది వారి నిద్రను ప్రభావితం చేస్తుంది.
అలాగే వాడుతున్న కొద్ది బొమ్మలు విరిగిపోవడం, పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.ఇది ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది.
విరిగిపోయిన బొమ్మలను( Damaged Toys ) మీ పిల్లల దగ్గర అస్సలు ఉంచకూడదు.వాస్తు ప్రకారం ఇది వారికి చెడు వాతావరణం కలిగిస్తుంది.
ఇది వారి శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.అలాగే పిల్లలున్న గదిలో బరువైన వస్తువులను అస్సలు ఉంచకూడదు.

వాస్తు ప్రకారం ఎక్కువ స్పేస్ లేకుండా ఉంటే స్వేచ్ఛగా శక్తి ప్రవాహం తగ్గుతుంది.ఇది మీ పిల్లలకు అసౌకర్యన్ని కలిగిస్తుంది.పిల్లల గదిలో పెయింటింగ్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే ఇవి కూడా మీ పిల్లలను ప్రభావితం చేస్తాయి.హింసాత్మక చిత్రాలను మీ పిల్లలకు దూరంగా ఉంచాలి.వీటికి బదులుగా మీ పిల్లలకు ప్రేమ పూర్వక వాతావరణాన్ని అందించే పెయింటింగ్లను వారి గదిలో ఉంచాలి.