చాలామంది ఈ పారిజాత పువ్వులతో( Parijatham Flowers ) పూజలు చేయకూడదని చెబుతూ ఉంటారు.అవి భగవంతులకు ఇష్టం లేని పువ్వు అని అందరూ చెబుతుంటారు.
అయితే తెలిసి తెలియక చేసిన ప్రసంగాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.అయితే పారిజాత పూలతో నిరభ్యంతరంగా దేవున్ని పూజించవచ్చు.
దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుండి పారిజాత వృక్షం ఉద్భవించింది.అయితే ఈ పారిజాత వృక్షాన్ని విష్ణు దేవుడు( Lord Vishnu ) స్వర్గానికి తీసుకువెళ్లారని పురాణాలు చెబుతున్నాయి.
అది పారిజాత వృక్షం నుంచి వచ్చిన పుష్పాల సుగంధ పరిమాళాలు స్వర్గం మొత్తం వ్యాపించాయి.
అయితే అదే విధంగా ద్వాపర యుగంలో సత్యభామ కోరిక మేరకు పారిజాత వృక్షాన్ని మళ్ళీ భూలోకంలోకి తీసుకురావాలని చెప్పడంతో శ్రీకృష్ణ పారిజాత( Sri Krishna Parijata ) వృక్షాన్ని స్వర్గం నుండి తీసుకొచ్చారు.అందుకే పారిజాత వృక్షాన్ని సాక్షాత్తు దేవతా వృక్షంగా భావిస్తారు.పారిజాత పువ్వుల గురించి మనందరికీ తెలిసిందే.
ఇవి ఎర్రటి కాడలను కలిగి తెలుపు రంగులో ఉంటాయి.దేవేంద్ర శాపం కారణంగా ఈ పూలు రాత్రి వేళలు మాత్రమే వికసిస్తాయి.
అయితే ఇలాంటి పుష్పాలు తొమ్మిది రకాలలో మనకు అందుబాటులో ఉంటాయి.
సాధారణంగా మనం పూలు పూజలో ఉపయోగించాలి అనుకుంటే కింద పడకుండా కేవలం చెట్టు నుండి కోసిన పుష్పాలతో పూజ చేయడం వలన మంచి జరుగుతుందని భావిస్తాము.కానీ ఈ పుష్పాలను ఎప్పుడూ చెట్టు నుంచి కోసి పూజ చేయకూడదు.ఈ పుష్పాలను ఎల్లప్పుడూ కూడా కింద రాలిన పుష్పాలని ఏరుకొని భగవంతుడికి పూజించాలి.
ఇక పారిజాత వృక్షం పురాణాల ప్రకారం స్వర్గలోకం నుండి వచ్చింది.కాబట్టి ఆ చెట్టులో వికసించే పుష్పాలు నేలను తాకినప్పుడు మాత్రమే వాటిని తీసుకొని పూజ చేయాలి.
కాబట్టి వృక్షం కింద ఎల్లప్పుడూ ఆవు పేడతో అలికి, శుభ్రంగా ఉంచి పూలను ఏరుకొని పూజ చేయడం వలన దేవ దేవతల అనుగ్రహం లభిస్తుంది.
DEVOTIONAL