నిత్యం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉల్లిపాయలు( Onions ) వాడుతుంటారు.అసలు ఉల్లి లేనిదే ఏ వంట సంపూర్ణం కాదు.
అలాగే ఉల్లి ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.జుట్టుకు( hair ) కూడా ఉల్లి ఎంతో మేలు చేస్తుంది.
ఉల్లిలో ఉండే సల్ఫర్ జుట్టు సంరక్షణకు ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.చాలా మంది హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో తీవ్రంగా సతమతం అవుతుంటారు.
అలాంటి వారికి ఉల్లి ఒక వరం అనే చెప్పవచ్చు.కేవలం ఉల్లితోనే హెయిర్ ఫాల్ సమస్యను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్కను సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత తొక్క తొలగించిన ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు ఉల్లి తొక్కలు వేసి కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
అరగంట అనంతరం వాటర్ తో హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.
కాబట్టి, అధిక హెయిర్ ఫాల్ సమస్యతో ఎవరైతే తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.హెయిర్ ఫాల్ ను అరికట్టండి.







