1.మునుగోడు ఎన్నికలపై హైకోర్టుకు బిజెపి
మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల నమోదుపై బిజెపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.జులై 31 వరకు ఉన్న ఓటర్ల జాబితాని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టుకు విన్నవించింది.
2.కేటీఆర్ కామెంట్స్

చంద్రబాబు, వైఎస్ఆరే నయం ఇప్పుడు బఫూన్ గాళ్ల తో మాట్లాడాల్సి వస్తోందని బీజేపీ నేతలను ఉద్దేశించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
3.ఒక వాట్సాప్ గ్రూప్ లో 1024 మంది
ఇక పై వాట్సాప్ గ్రూప్ లో 1024 మంది సభ్యులు ఉండే విధంగా అవకాశం కల్పించింది.
4.జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం మహబూబ్ నగర్ లో జరిగింది.
5.తెలంగాణ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ఆగ్రహం
విద్యుత్ ఉద్యోగుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
6.టిఆర్ఎస్ విమానంపై ఫిర్యాదు

టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ తరఫున కొనుగోలు చేసిన విమానం పై సమగ్రంగా విచారణ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు.
7.ములయం అంత్యక్రియలకు కేసీఆర్
ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్ కు వెళ్లనున్నారు.యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన పాల్గొన్నారు.
8.బీసీల జాబితాలో కులాల తొలగింపు పై జోక్యానికి సుప్రీం నిరాకరణ

బీసీల జాబితాలో కులాల తొలగింపు అంశంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
9.పవన్ కళ్యాణ్ పర్యటన విరమించుకోవాలి : మంత్రి అమర్నాథ్
మూడు రాజధానులకు మద్దతుగా వైసిపి ఈనెల 15న చేపట్టనున్న విశాఖ గర్జన సభను డైవర్ట్ చేసేందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రోజు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారని, పవన్ ఆ పర్యటనను విరమించుకోవాలని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు.
10.సోము వీర్రాజు కామెంట్స్

వైసిపివి మైండ్ గేమ్ పాలిటిక్స్ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
11.టిడిపి పై కొడాలి నాని కామెంట్స్
అస్తమించిన వ్యవస్థ టిడిపి అని, ఆ పార్టీ డీ ఫాల్టర్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
12.ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ పొడగించిన ఏపీ ప్రభుత్వం

ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ స్కీమ్ ను పొడగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
13.మంత్రి బుగ్గన అధ్యక్షతన ఎస్ ఎల్బి సీ సమావేశం
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏపీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు జరుగుతోంది.
14.‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర ‘ అంటూ పవన్ ట్వీట్

‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర ‘ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
15.మహా పాదయాత్రకు నిరసనగా వైసీపీ ఫ్లెక్సీలు
అమరావతి రైతుల మహా పాదయాత్రకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలో రోడ్డు పొడవునా వైసిపి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
16.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ లు నిండిపోయి , రెండు కిలో మీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు.
17.ఘనంగా చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉట్టి కృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు స్వామి వారు దర్శనం ఇస్తున్నారు.
18.అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్మహత్యాయత్నం
అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తిక్కి రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.
19.శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ప్రాజెక్ట్ కు ఉన్న రెండు గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
20.రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్
ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ ను ఈ నెల 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తెలిపారు.
.