సినిమా హీరోయిన్ల రెమ్యునరేషన్ల గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెజారిటీ హీరోయిన్లు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రియాంక జవాల్కర్( Priyanka Jawalkar ) తొలి రెమ్యునరేషన్ కేవలం 6,000 రూపాయలు కావడం గమనార్హం.మ్యాడ్ స్క్వేర్ తో హిట్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించారు.
టాక్సీవాలా సినిమాలో( Taxiwala ) నటిస్తున్న సమయంలో కలవరమాయె అనే సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆమె పేర్కొన్నారు.టాక్సీవాలా సినిమా కోసం తాను యాక్టింగ్ క్లాసులకు హాజరయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.
కలవరమాయె సినిమాను అప్పటికే ఒక హీరోయిన్ తో షూట్ చేశారని ఆమె యాక్టింగ్ నచ్చకపోవడంతో నన్ను సంప్రదించారని ఆమె కామెంట్లు చేశారు.

నాకు రెమ్యునరేషన్( Remuneration ) ఇవ్వడానికి కూడా వాళ్ల దగ్గర బడ్జెట్ లేదని ప్రియాంక పేర్కొన్నారు.మా దగ్గర 10,000 మాత్రమే ఉన్నాయని వాళ్లు చెప్పగా బడ్జెట్ లేనప్పుడు ఇవ్వడం దేనికిలే అని వద్దన్నానని నా ఫ్రెండ్ మాత్రం ఎంతో కొంత తీసుకోవాలి అని చెప్పిందని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చారు.అయితే నేను రెమ్యునరేషన్ వద్దన్నానని ఆ 10,000లో కొంత వాడేసి నాకు 6,000 ఇచ్చారని ఆమె తెలిపారు.

స్టోరీ బాగుంటేనే సినిమా చేయాలని రూల్ పెట్టుకోవడంతో గమనం మూవీ తర్వాత గ్యాప్ వచ్చిందని ప్రియాంక కామెంట్లు చేశారు.టిల్లు స్క్వేర్ సినిమాలో కేవలం 15 సెకన్లు మాత్రమే కనిపించే పాత్ర చేశానని ఆమె వెల్లడించారు.ప్రియాంక జవాల్కర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయి కాగా సరైన ఆఫర్లు వస్తే ఈ బ్యూటీ కెరీర్ మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది.
ఈ స్టార్ బ్యూటీ వయస్సు ప్రస్తుతం 32 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.