బియ్యం( Rice ) కడగకుండా ఎవరు కూడా అన్నాన్ని వండుకోరు.కానీ ఈ మధ్య కాలంలో బియ్యం కడగడం వల్ల దానిలోని పోషకాలు అన్ని పోతున్నాయి అని చాలామంది భావిస్తూ ఉన్నారు.
అందుకే బియ్యం కడగకుండా అన్నం వండేస్తూ ఉన్నారు.మనం కామన్ గా రోజు తినే ఆహారం అన్నం అని చాలా మందికి తెలుసు.
బియ్యాన్ని అన్నం గా వండుకొని తింటూ ఉంటారు.మనకు సధారణంగా ఎనర్జీ ఇచ్చేది అన్నమే.
బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవే మనకు శక్తిని అందిస్తాయి.
అయితే మనం అన్నం( Cooked Rice ) వండే ముందు మనలో చాలామంది బియ్యం కడుగుతూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్( Red Rice ) మీరు ఏ బియ్యం తిన్నా సరే కచ్చితంగా వాటిని కడిగి మాత్రమే వండుకోవాలి.ఒక్కసారి కాదు అవసరమైతే రెండు, మూడు సార్లు కడిగిన పర్వాలేదు అని నిపుణులు చెబుతున్నారు.బియ్యం కడగడం వల్ల అందులో ఉండే స్టార్చ్( Starch ) పోయి అన్నం మంచిగా ఉడుకుతుంది.
ఇది మన అందరికీ తెలుసు.కానీ స్టార్ట్స్ మాత్రమే కాకుండా బియ్యంలో అర్సెనిక్ అనే పదార్థం కూడా ఉంటుంది.
ఇది కేవలం భూమిలో పండే పంటలలోకి మాత్రమే వస్తుంది.అయితే ఇది విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు.

అందుకే బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాత మాత్రమే అన్నం వండుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అలా కడగకుండా వండుకొని తినడం వల్ల ఆహారం విషయంగా మారుతుంది.దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఇది చర్మం, మూత్రాశయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం ప్రోస్టేట్ క్యాన్సర్( Prostate Cancer ) తో సహా వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇది చర్మ గాయాలు, న్యూరోటాక్సిసిటీ, హృదయ సంబంధ వ్యాధులు, అసాధారణమైన గ్లూకోజ్ జీవక్రియ, మధుమేహం( Diabetes ) వంటి ఇతర ప్రతికూల ప్రభావాలకు కూడా ఇది దారితీస్తుంది.అందుకోసమే బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీటితో కడిగి ఆ తర్వాత వండుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.