దాదా సాహెబ్ ఫాల్కే( Dada Saheb Phalke ) … భారత దేశానికి తొలిసారిగా సినిమా అంటే ఏంటో పరిచయం చేసిన వ్యక్తి.ఇతడే సినిమా అనే పదానికి మొట్టమొదటి నిర్మాత, రచయిత, దర్శకుడు,,,ఇలా చాల …అందుకే ఇతడిని భారతీయ సినిమా పితామహుడు అని అంటూ ఉంటారు.
కానీ ఒక మొగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు.అది దాదా సాహెబ్ ఫాల్కే విషయంలో ఖచ్చితంగా నిజమే.
దాదా సాహెబ్ ఫాల్కే అస్సలు పేరు ధుండీరాజ్గోవింద్ ఫాల్కే( Dhundirajgovind Phalke ).అయితే సినిమా వల్ల ఫాల్కే కి ఒరిగింది ఏమి లేదు.ఫోర్డ్ కారులో తిరిగిన ఫాల్కే చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేక, బహుమానాలు వచ్చిన డబ్బు తో జీవించాడు.

ఈయన కొడుడు ముంబై( Mumbai ) వీధుల్లో చిల్లర వ్యాపారం చేసుకొని జీవించాడు.ఇక సినిమా కోసం ఉన్నదంతా పోగొట్టుకుంటున్న కూడా ఫాల్కే సతీమణి సరస్వతి( Saraswati ) భర్తకు తన శాయశక్తులా కష్టపడి పని చేసి సపోర్ట్ చేస్తూ వచ్చింది.ఫాల్కే తీసిన మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర ( Raja Harishchandra )సినిమా నిర్మాణంలో ఆమె కీలకమైన బాధ్యతను తీసుకున్నారు.
ఆ సినిమాకు ఆమె టెక్నీషియన్ గా పని చేసి మొట్ట మొదటి సినిమా లేడీ టెక్నీషియన్ గా రికార్డు సృష్టించారు.సినిమా షూటింగ్ జరుగుతుంటే కెమెరా నుంచి పెద్ద ఎత్తున వెలుతురు వచ్చేది.
ఆ వెలుతురు కి అడ్డంగా ఒక బెడ్ షీట్ ని పట్టుకొని సరస్వతి సినిమా కోసం అన్ని సమకూర్చేవారట.ఆమె రాత్రి పూట చిమ్మ చీకట్లో టెక్నీకల్ పనులను నిర్వహించేవారట.

ఒక సినిమా కోసం అప్పట్లో 60 నుంచి 70 మంది పని చేసేవారట.వారందరికీ అన్ని పూటల తినడానికి భోజనం మరియు పూర్తి వంట ఆమె ఒక్కతే చూసుకునేవారట.ఇలా ఇంట, బయట సరస్వతి సపోర్ట్ చేస్తుంటే ఫాల్కే సినిమా తీసి మన భారత దేశానికి పరిచయం చేయగలిగారు.పైగా అయన పిల్లలను కూడా సినిమా కోసం వాడుకున్నారు.
ఫాల్కే తీసిన మొదటి సినిమాలో అతడి కుమారుడు బాల చంద్ర తొలి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అయన పెద్ద కుమార్తె మందాకినీ కూడా నటించారు.
సినిమా కోసం సర్వం పోగొట్టుకొని ఒక చరిత్ర గా మిగిలిపోయారు ఫాల్కే దంపతులు.