ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు.వారి విషయం పక్కన పెడితే అక్కడ శవం ఇంటికి వచ్చినప్పటి నుంచి దాహణం చేసే వరకు చాలా ఆచారాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
వెంటనే ఒక దిక్కున మంట పెడుతారు.కొత్త బట్టలు తెస్తారు.
చనిపోయిన వారికి స్నానం చేయిస్తారు.సాంబ్రాణి( Sambrani ) వేస్తారు.
దహనం చేసే వారికి ఎలాంటి తాయెత్తులు, రుద్రాక్షలు( Amulets , Rudrakshas ) ఉంచరు.ఇలా ఎన్నో ఆచారాలు ఉంటాయి.
వాటిలో భాగంగానే అంతక్రియలకు తీసుకెళ్లినప్పుడు డబ్బులు, టపాసులు పేలుస్తారు.చిల్లర నాణేలను మరమరాలలో వేసి దారిలో చల్లుకుంటూ పోతారు.
ఎందుకు చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులు ఎందుకు పడేస్తారు.సాధారణంగా మనం డబ్బును లక్ష్మీదేవి( Goddess Lakshmi ) స్వరూపంగా భావిస్తాం.అలాంటిది ఇలా ఒక శవం ఊరేగింపులో చిల్లర నాణేలను ( coins )రోడ్డుంతా చల్లడం వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చనిపోయిన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ చనిపోయిన తర్వాత వారు ఒక్క రూపాయిని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పడానికే ఇలా డబ్బులు చల్లుతారు.
రేపు మీ పరిస్థితి కూడా ఇదే కాబట్టి న్యాయంగా, ధర్మంగా జీవించమని చెప్పడానికి కూడా ఇలా చేస్తారని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు.
చల్లిన డబ్బులను ఎక్కువగా యాచకులు, చిన్నపిల్లలు తీసుకుంటూ ఉంటారు.ఈ విధంగా చేస్తే నిరుపేదలకు మరణించిన వారి పేరు మీదగా సహాయం చేశామనే తృప్తి వారి కుటుంబ సభ్యులకు ఉంటుంది.శవయాత్రలో పూలు, పేలాలు చల్లడం వంటివి చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది.
పూలు చల్లడం అంటే మరణించిన వారిని గౌరవించడం దేవునిగా భావించడం అని అర్థం చేసుకోవచ్చు.పేలాలు చల్లడం వల్ల పక్షులు, క్రిమి కీటకాలకు ఆహారం వేసినట్టు భావిస్తారు.
బతికి ఉన్నప్పుడు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కడదాకా మనతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్లలేం.కానీ జీవితం అంతా ఆ డబ్బు కోసమే కష్టపడతాం.
జీవితం ఎంత విచిత్రమైనదో కదా.