కొత్త ఏడాది సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.కొత్త సంవత్సరం పురస్కరించుకొని కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల కి చేరుకుంటున్నారు.
ఇంకా చెప్పాలంటే మరో వైపు రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పరిమితమయ్యే అవకాశం ఉంది.అంతే కాకుండా శనివారం రోజు స్వామివారిని దాదాపు 80,000 మంది భక్తులు దర్శించుకున్నారు.30 వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.ఇంకా చెప్పాలంటే స్వామి వారికి భక్తులు కానుక రూపంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలను సమర్పించారని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.దీని వల్ల స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దేవాలయంలో వైఖానస అగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి కైంకర్యాలను అర్చకులు నిర్వహిస్తారు.
ప్రత్యూషకాల ఆరాధనతో దేవాలయ ద్వారములను అర్చకులు తెరిచారు.వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు,జియ్యం గార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు.
బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలుకొలుపుతారు.బంగారు వాకిలి వద్ద శ్రీవారిని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పాటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చిపాలను అర్చకులు నివేదిస్తారు.ఆ తర్వాత చాలా కార్యక్రమాలు చేసిన తర్వాత శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి కర్పూర హారతి సమర్పిస్తారు.
.