విఘ్నాలను తొలగించే వినాయకుడికే తొలి పూజ చేస్తారని పండితులు( Scholars ) చెబుతున్నారు.ఎన్ని పేర్లతో కొలిచిన భక్తుల కోరికలు తీర్చే గణపయ్య అంటే భక్తులకు( Devotees ) ఎంతో ఇష్టం.
దాని కంటే ముందు గా తొండం వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమప్రద అని కొలుస్తారు.వినాయకుడి తొండం ఉండే ఆకృతిలో ఎన్నో అర్ధాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
కుడివైపుకు తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి( Lakshmi Ganapati ) అని, తొండం లోపలి వైపుకు ఉన్న గణపతిని తపో గణపతి అని పిలుస్తారు.ఈ తొండం ముందుకు ఉన్న గణపతికి అసలు పూజలు చేయరాదని పండితులు చెబుతున్నారు.

వినాయకుడి తొండం ఎప్పుడూ ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి.వినాయకుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి ( Gauri Devi )దిక్కుగా ఉండాలని, అందుకే ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.ఎందుకంటే కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతిని దక్షిణముఖి గణపతి అని పిలుస్తారు.ఇలాంటి విగ్రహాలను కేవలం దేవాలయాలలో మాత్రమే ఏర్పాటు చేస్తారు.ఇలా గణపతి అంటే తొండం ఏదో వైపు తిరిగి ఉంటుంది.కానీ అసలు తొండమే లేని గణపతిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు.
అసలు అలాంటి గణపతి ఉంటాడని కూడా చాలా మందికి తెలియదు.కానీ అలా తొండమే లేని గణపతి దేవాలయం ఒకటి మన భారతదేశంలో ఉంది.
ఈ ఆలయానికి చాలా సంవత్సరాల చరిత్ర ఉంది.ఈ దేవాలయంలో తొండం లేని గణపతి చిత్రాలను 300 సంవత్సరాల వరకు బయటకు రానివ్వలేదు.ఈ గణపయ్యను దర్శించుకోవాలంటే 365 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.

ఈ తొండం లేని గణపయ్య దేవాలయం జైపూర్ లో ఉంది.ఆరావళి పర్వతం మీద కొలువైన ఈ దేవాలయం ఘర్ గణేష్ పేరుతో ప్రసిద్ధి చెందింది.500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయానికి వినాయక చవితి( Vinayaka Chavithi ) రోజున ఈ తొండంలేని వినాయకున్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తారు.అలాగే భక్తులు ఎలుక చెవిలో తమ కోరికలు చెబితే స్వామివారు ఆ కోరికలను నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు.అలాగే తమ కోరికలను నెరవేర్చాలని కోరడంతో పాటు భక్తులు దేవాలయానికి వరుసగా ఏడు బుధవారాలు వచ్చి గణపయ్యను దర్శించుకుంటారు.