అదృష్టం కలసిరావడానికి ఏవారంలో, ఏ దేవుడుకి, ఎన్ని ప్రదక్షణలు చేయాలో తెలుసా?

మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే గుడికి వెళుతూ ఉంటాం.గుడికి వెళ్ళాక తప్పనిసరిగా 3,5,7 బేసి సంఖ్యలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటాం.

 Adrustam Kalisi Ravadaniki Gudilo Pradakshina-TeluguStop.com

అయితే ఏ రోజు ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం.చాలా మందికి ఏ దేవుడికి ఎన్ని ప్రదిక్షణలు చేయాలో తెలియదు.

ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.

ఆదివారం – సూర్యనారాయణ స్వామికి 18 ప్రదక్షణలు, నవగ్రహాలకు 18 ప్రదక్షణలు, నాగేంద్ర స్వామికి 18 ప్రదక్షణలు,సుబ్రహ్మణ్య స్వామికి 27 ప్రదక్షణలు చేస్తే మంచి జరుగుతుంది.

సోమవారం – శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి 20 ప్రదక్షణలు, శ్రీరామ చంద్రునికి 20 ప్రదక్షణలు, శ్రీ కృష్ణుడికి 20 ప్రదక్షణలు చేయాలి.

మంగళవారం – సింధూర ఆంజనేయస్వామికి 21 ప్రదక్షణలు.

శివాలయంలో 18 ప్రదక్షణలు, గణపతికి 27 ప్రదక్షణలు చేస్తే మంచిది.

బుధవారం – సరస్వతీ దేవికి 17 ప్రదక్షణలు చేయాలి.
గురువారం – శ్రీ సాయి దేవాలయంలో 16 ప్రదక్షణలు చేయాలి.

శుక్రవారం – దుర్గాదేవికి 20 ప్రదక్షణలు చేయాలి.

శనివారం – వెంకటేశ్వర స్వామికి 21 ప్రదక్షణలు చేయాలి.ఈ విధంగా ఇష్ట దైవానికి ఇష్టమైన రోజు ప్రదక్షిణలు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube