విక్కి డోనర్ సినిమా చూసారా ? ఇదే సినిమాని ఇప్పుడు సుమంత్ “నరుడా డొనరుడా” పేరుతో రీమేక్ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరో ఒక స్పెర్మ్ డోనర్.
అంటే వీర్యాన్ని దానం చేస్తుంటాడు.పిల్లల్ని కనలేని మగవారు ఉన్న కుటుంబాలన్ని హీరోగారి వీర్యంతో సంతానాన్ని పొందుతూ ఉంటారు.
ఇండియాలో ఈ వీర్యదానం పెద్దగా పాపులర్ కాలేదులేండి ఇంకా.అయితే ఇన్నిరోజులు వీర్యదాత కావాలంటే హాస్పిటల్ కి వెళ్ళి, వీర్యదాతల వివరాల్ని సేకరించి, ఫిల్టర్ చేసి ఒక దాతని ఎన్నుకునేవారు.
కాని ఇప్పుడు అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు.ఎందుకంటే వీర్యాన్ని కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయొచ్చు.ఇదేమి వింత అని ఆశ్చర్యపోయే బదులు వివరాలు చదవండి.
ఈ అప్లికేషన్ పేరు “Order a daddy”.
ప్రస్తుతానికైతే కేవలం బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చింది.పేరులో ఉన్నట్లే గర్భం పొందడానికి ఓ డాడీని ఆర్డర్ చేయొచ్చు.
అంటే వీర్యాన్ని ఆర్డర్ చేయడం.ఈ ఆప్ ని వాడి మహిళలు తమకెలాంటి వీర్యం కావాలో, అంటే వీర్యదాత రంగు, ఎత్తు, జుట్టు లాంటివి ఎన్నుకోని అదే దాత దగ్గర వీర్యాన్ని పొందవచ్చు.
ఒకవేళ కావాల్సిన క్వాలిటిలు ఉన్న వీర్యదాత దొరక్కపోతే, ఎలాంటి వీర్యదాత కావాలో డిస్క్రిప్షన్ ఇవ్వాలి.సరిగ్గా కావాల్సిన లక్షణాలు ఉన్న వీర్యదాత దొరగ్గానే ఆప్ నోటిఫికేషన్స్ పంపిస్తుంది.
అన్నట్లు వీర్యం ధరెంతో చెప్పలేదు కదూ, 950 యూరోలు .భారతీయ కరెన్సిలో 71,184 రూపాయలు.