తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసి సమర్థవంతంగా ఎదుర్కొని తన ప్రభుత్వాన్ని విమర్శించడం దారుణమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వం రాబడి భారీగా తగ్గినా మహమ్మరి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,130.19 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు.కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు రావడంతో అన్ని రాష్ట్రాలు దేశాల్లో అప్పులు చేస్తున్నాయని తెలిపారు.పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు.చదివే పిల్లలకు అతి పెద్ద ఆస్తి చదువే అని అందుకే వారి కోసం దాదాపు రూ.25,914,13 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.అవ్వాతాతలకు రూ.37,461.89 కోట్ల పెన్షన్ ను పంపిణీ చేశామని ఇవిగాక అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ద్వారా రూ.17 వేల కోట్లు అందించామన్నారు.ఇక కరోనా కష్టకాలంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్నామన్నారు.అవాస్తవాలు, అసంబద్ధ ప్రచారాలతో వ్యూహం ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన మండిపడ్డారు.
సంక్షోభ సమయంలో నేరుగా ప్రజల చేతిలో డబ్బులు పెట్టడం ద్వారా వస్తువులు, సేవల డిమాండ్ దెబ్బతినకుండా కాపాడికలిగినట్లు ఆయన వివరించారు.

ప్రజలే కాదు ఆర్థిక వలయంలో ఉన్న అనేక కంపెనీలు వాటి ఆధారంగా లక్షలాది ఉపాధి మార్గాల్ని నిలబెట్టమని బుగ్గన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని బుగ్గన ఆరోపించారు.టీడీపీ హయాంలో చేసిన అప్పులు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు.
అప్పులు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే చేసామని తాము అప్పు చేసిన ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రం ప్రగతి కోసమేనని బుగ్గన స్పష్టం చేశారు.