చేతులు మరియు వేళ్లు కఠినముగా ఉంటే,అప్పుడు వాటికి తేమ అవసరం ఉందని గ్రహించాలి.తేమ లేకపోతే చేతులు మరియు వేళ్లు పొడిగా మారి చివరకు పగుళ్ళకు దారితీస్తుంది.
అంతేకాక పగుళ్ళు రావటానికి పొడి గాలి, కఠినమైన రసాయనాలు ఉన్న చర్మ ఉత్పత్తులను వాడటం,వాతావరణ పరిస్థితులు, సామాను తోమటం,బట్టలు ఉతకటం వంటివి కారణం అవుతాయి.అయినప్పటికీ కొన్ని ఇంటి నివారణల ద్వారా వేళ్ళ పగుళ్ళను నయం చేసుకోవచ్చు.
1.గోరువెచ్చని నీరు
ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో పది నిమిషాల పాటు వేళ్ళను ఉంచాలి.
ఈ విధంగా చేయుట వలన చేతులకు మరియు వేళ్ళకు ఉన్న మురికి తొలగిపోతుంది.పొడి చర్మ కణాలు చర్మం పై పొర మీద చేరతాయి.గోరువెచ్చని నీటిలో వేళ్ళను పెట్టినప్పుడు పొడి చర్మ కణాలు సులభంగా స్క్రబింగ్ అవుతాయి.ఎప్సోమ్ ఉప్పును ఉపయోగిస్తే మృత కణాలను తొలగించటానికి మరియు పగుళ్ళను నయం చేయటంలో అద్భుతంగా పనిచేస్తుంది.
2.కొబ్బరి నూనె
పగిలిన వేళ్ళకు తేమ అవసరం.సహజంగా తేమ ఉండే కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.వెచ్చని కోబ్బరి నూనెతో వేళ్ళకు మసాజ్ చేయాలి.కొబ్బరి నూనెలో యాంటీబ్యాక్టీరియల్ సమ్మేళనాలు ఉండుట వలన పగుళ్లకు కారణం అయిన బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ లను నివారించటానికి సహాయపడుతుంది.ప్రతి రోజు క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను వేళ్ళకు రాస్తే తేమ అంది మంచి పలితం కనపడుతుంది.
3.పెట్రోలియం జెల్లీ
పెట్రోలియం జెల్లీ అనేది మనకు ఇంటిలో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.వేళ్ళ పగుళ్ళ సమస్య ఏర్పడినప్పుడు పెట్రోలియం జెల్లీ రాయటం ప్రారంభించాలి.క్రమం తప్పకుండా పగుళ్ళకు పెట్రోలియం జెల్లీని రాస్తే వేళ్ళకు తేమ అంది పగుళ్ళు తగ్గుతాయి.రాత్రి పడుకొనే ముందు చేతులకు మరియు వేళ్ళకు పెట్రోలియం జెల్లీ రాసుకుంటే కేవలం 15 రోజుల్లోనే పగుళ్ళు తగ్గుతాయి.
4.వెన్న
వేళ్ళకు వెన్నతో మర్దన చేస్తే పగుళ్ళ నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది.చర్మం మృదువుగా మరియు నునుపుగా ఉండటానికి అవసరమైన తేమను వెన్న అందిస్తుంది.
ప్రభావిత ప్రాంతంలో వెన్నను రాసి నిదానంగా మసాజ్ చేయాలి.రాత్రి పడుకొనే ముందు చేతులకు వెన్నను రాసి, చేతులను కవర్ చేయటానికి కాటన్ చేతి తొడుగులను ఉపయోగించాలి.