శరీరంలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఇవే..

ఈ మధ్యకాలంలో సాధారణంగా చాలామంది ప్రజలలో అధిక కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది.సాధారణంగా కొంతమందికి కొలెస్ట్రాల్ పేరు వినగానే అది చాలా చెడ్డదని అనుకుంటూ ఉంటారు.

 These Are The Symptoms Of High Cholesterol In The Body , High Cholesterol , Bod-TeluguStop.com

కానీ ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి.మంచి కొలెస్ట్రాల్ శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

కానీ చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తం గడ్డ కట్టడానికి దారితీస్తుంది.

ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది.

ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.మంచి జీవన శైలి అనుసరించాలి.

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగింది అని చెప్పడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అది నేరుగా రక్త పోటుకు దారి తీస్తుంది.

రక్తంలో కొవ్వు శాతం ఎంత పెరిగితే రక్తపోటు అంతగా పెరుగుతుంది.కాబట్టి కారణం తెలియకుండానే బిపి పెరిగిపోతుంటే అధిక కొలెస్ట్రాల్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు.

Telugu Fat Level, Pressure, Diabetes, Tips, Cholesterol-Telugu Health

ఇంకా చెప్పాలంటే కాళ్లు, చేతులు తిమ్మిరికి గురికావడాన్ని తేలిక గా తీసుకోకూడదు.ఇది అధిక కొలెస్ట్రాల్ కు సంకేతంగా గుర్తించాలి.ధమనులలో రక్త ప్రసరణ ఆక్సిజన్ సరఫరా లో అవరోధం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది.ఇంకా చెప్పాలంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది.

ఇది సిరలలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.చేతివేళ్లు, కాలి వేళ్లకు సరైన రక్తం సరఫరా లేకపోవడం వల్ల అవి లేత గులాబీ రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతాయి.

Telugu Fat Level, Pressure, Diabetes, Tips, Cholesterol-Telugu Health

అయితే ఉండవలసిన దానికన్నా అధిక కొవ్వు ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.మధుమేహం ఉంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది.అందువల్ల మధుమేహం ఉన్నవారు మూడు నెలలకు ఒకసారి రక్తంలో సరాసరి చక్కర శాతం ఎంత ఉందో తెలుసుకునే పరీక్షతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకునే పరీక్ష కూడా చేయించుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను అదుపు చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube