నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. హైపర్ ఆది వార్నింగ్ మామూలుగా లేదుగా!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పిఠాపురం ఎమ్మెల్యేగా సాధించిన విజయం అభిమానుల్లో జోష్ నింపింది.ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తరపున హైపర్ ఆది కూడా పిఠాపురంలో ప్రచారం చేయగా ప్రచారానికి మంచి స్పందన వచ్చింది.

 Hyper Aadi Warning To Pandu In Dhee Show Details Here Goes Viral In Social Me-TeluguStop.com

తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.

హైపర్ ఆది ( Hyper Adi )మాట్లాడుతూ “ఏందిరా.

బంతి భోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు అందరూ” అని చెప్పగా పండు “ఏంటి నువ్వు కూడా ఛాలెంజ్ మరిచిపోయావా వాళ్లు వచ్చి కూర్చోవాలి మనం గెలిచాం లాస్ట్ రౌండ్” అని చెబుతాడు.హైపర్ ఆది వెంటనే “ఆడవాళ్లు గుళ్లో కూర్చోవాలి కానీ ఒళ్లో కూర్చోవడం ఏంట్రా సిగ్గు లేదా మీకు” అంటూ హైపర్ ఆది రియాక్ట్ అయ్యారు.

ఆ తర్వాత హైపర్ ఆది “నువ్వు ఎలా కూర్చున్నావో తెలుసా.ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ అయ్యాక ఆరెంజ్ జ్యూస్ 500 రూపాయల కోసం కూర్చున్నట్టు కూర్చున్నావ్” అని పంచ్ వేయగా ఆ పంచ్ ఆకట్టుకుంది.ఆ తర్వాత పండు “నువ్వెన్ని చెప్పినా ఈరోజు తగ్గేది లేదు.అడ్డొస్తే తొక్కి పడేస్తా” అని చెప్పగా హైపర్ ఆది వెంటనే “మనం ఎవరి తాలూకానో తెలుసా నీకు పిఠాపురం గుర్తుందా” అని కామెంట్లు చేశారు.

ఈ నెల 26వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఈ షోకు బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి.ఢీ షోకు హన్సిక జడ్జిగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ షో చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.ఢీ షో బుల్లితెర డ్యాన్స్ షోలలో స్పెషల్ షోగా నిలిచి అందరినీ ఆకట్టుకుంటోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ షో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube