ఢిల్లీ-ఆగ్రా రైలులో డచ్ మహిళను వేధించిన కామాంధుడు.. ఇతనికి సిగ్గు లేదా?

మన భారతదేశంలో (india)చాలామంది విదేశీ మహిళలు పర్యటించడం కామనే.అయితే వారిని కొందరు స్థానికులు వేధిస్తూ మన పరువు తీసేస్తున్నారు ఇటీవల కూడా ఒక వ్యక్తి చేసిన పని అందర్నీ సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది.

 The Lustful Man Who Harassed A Dutch Woman On The Delhi-agra Train...is He Not A-TeluguStop.com

ఇటీవల ఓ డచ్ మహిళ ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లే రైలు ప్రయాణంలో తనకు ఎదురైన ఒక అసౌకర్య సంఘటనను వెల్లడించారు.

ఈ మహిళ “అవకాడో ఆన్ ది రోడ్” (Avocado on the Road)పేరుతో ఇన్‌స్టాలో తన ట్రావెల్ కథనాలను పంచుకుంటుంది.

అయితే ఆమె ప్రయాణిస్తున్న రైలులో, తోటి ప్రయాణికుడు ఒకరు ఆమెకు తెలియకుండా రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీశారు.ఆ వ్యక్తిని ఆపమని ఆమె ఎంత చెప్పినా, అతను వినలేదు.

విసిగిపోయిన ఆమె, చివరకు అతడినే తన ఫోన్‌లో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది.

ఆమె తన పోస్ట్‌లో “నేను బాగా అలసిపోయి, రైలు(Train) ఎక్కి కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను.

కానీ నా పక్కన కూర్చున్న వ్యక్తి నాతో మాట్లాడుతూ, రహస్యంగా నా ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు.నేను అతన్ని పట్టించుకోకుండా కిటికీలోంచి బయటకు చూడటం మొదలుపెట్టాను.కానీ అతను నన్నే చూస్తూ, నేను ఫోన్‌లో ఏం చేస్తున్నానో కూడా గమనిస్తూ ఉన్నాడు.” అని రాసుకొచ్చింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ, “నేను అతన్ని ఆపమని చెప్పాను, కానీ అతను నన్ను పట్టించుకోలేదు.అందుకే నేను అతన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టాను.కనీసం అప్పుడైనా అతనికి అర్థమవుతుందని ఆశించాను.అతనికి కొంచెం ఇంగ్లీష్ వచ్చు, కానీ అతను తనలో తానే మునిగిపోయి, నా మాట వినడానికి సిద్ధంగా లేడు” అని తెలిపింది.

ఆ వీడియోలో ఆ మహిళ “నేను భారతదేశంలో రైలులో ప్రయాణిస్తున్నాను.ఈ వ్యక్తి నా ఫోటోలు తీస్తూనే ఉన్నాడు.అందుకే నేను కూడా అతని ఫోటోలు తీయాలని నిర్ణయించుకున్నాను.ఇలాంటి కామాంధుడు కనిపెడితే మీరు కూడా ఇలాగే చేయండి.” అని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో అతడు సిగ్గులేకుండా కెమెరాకు ఫోజులు(Poses camera) ఇవ్వడమే ఇక్కడో పెద్ద వింత.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ తరువాత, ఆమె తన అనుభవానికి మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అది తన మొదటి భారతీయ రైలు (Indian Train)ప్రయాణమని చెప్పింది.“నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను.ఇలాంటి అనుభవాలు ఎదురైనా కూడా, ఈ అందమైన దేశాన్ని అన్వేషించడం కొనసాగిస్తాను” అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.

ఆమె తన ఉద్దేశం నెగిటివిటీని వ్యాప్తి చేయడం కాదని స్పష్టం చేసింది.“భారతదేశం అద్భుతమైన వ్యక్తులతో నిండి ఉంది.నేను మంచి విషయాలను మాత్రమే చూపించాలనుకుంటున్నాను.చెడు విషయాలు చాలా తక్కువ.” అని ఆమె పేర్కొంది.“అందరికీ శాంతి, ప్రేమ” అంటూ ఆమె తన పోస్ట్‌ను ముగించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube