ఆకాశంలో అడపాదడపా వింతలు, విశేషాలు మరియు అద్భుతాలు చోటు చేసుకుంటాయి అనే విషయం విదితమే.వీటిని చూసి ప్రజలు కూడా షాక్ అవుతుంటారు.
తాజాగా బ్రిటన్( Britain ) ప్రజలు ఆకాశంలో ఓ వింతను తేరిపారా చూసి ఆనందించారు.రాత్రి సమయంలో ఆకాశంలో మెరుస్తూ తిరుగుతున్న వలయాకారాలు వారికి కనిపించాయి.
కాగా గ్రేటర్ మాంచెస్టర్ నుంచి డెర్బీషైర్, లాంక్షైర్ నుంచి స్టాఫోర్డ్‌షైర్ వరకు కనిపించిన విజువల్స్ అయితే జనాలను కనువిందు చేసాయి.ఈ క్రమంలోనే చాలా మంది తమ ఫోన్‌లలో ఈ అరుదైన ఘటనను వీడియోలు కూడా తీయడం జరిగింది.
తరువాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సదరు దృశ్యం తాలూక విజువల్స్ జనాలకు కూడా తెగ నచ్చేసాయి.
మెరుస్తున్న స్పైరల్స్ నెమ్మది నెమ్మదిగా తిరుగుతూ, కాంతిని వెదజల్లుతున్న వీడియోలు చూసి కొందరు అద్భుతం… బ్యూటిఫుల్ అంటూ పోస్టులు కూడా పెట్టారు.మరికొందరు ఇదేదో వింతగా భావించిన పరిస్థితి ఉంది.ఆష్టన్-అండర్-లైన్‌లో ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి… ‘ఇంకెవరైనా దీన్ని ఆకాశంలో చూస్తున్నారా? అది తిరుగుతూనే ఉంది!’ అని అడిగాడు.దాంతో బోల్టన్‌లోని హార్విచ్‌లో మరొక వ్యక్తి.‘ఇది హార్విచ్ మీదుగా ఎగురుతూ చాలా అందంగా ఉంది.’ అని రాసుకొచ్చాడు.రాడ్‌క్లిఫ్ నివాసి ఒక ఫోటోను షేర్ చేస్తూ, ‘రాడ్‌క్లిఫ్ మీదుగా ఎవరైనా దీన్ని చూశారా? నేను, పిల్లలు భయపడ్డాం!’ అని పోస్ట్ చేశాడు.ఇది గ్రహాంతరవాసుల నౌక లేదా UFO కావచ్చు అని చాలామంది కంగారు పడ్డారు కూడా!
ఈ క్రమంలోనే మరికొందరు… ఎలాన్ మస్క్( Elon Musk ) కంపెనీ స్పేస్‌ఎక్స్‌కి( Space X ) చెందిన ఫాల్కన్ 9 రాకెట్ విజువల్స్ ఇవేనా అంటూ రాసుకొచ్చారు.అయితే ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు.2022లో న్యూజిలాండ్ వాసులు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శాటిలైట్‌ని లాంచ్ చేసిన తర్వాత ఇలాంటి మెరుస్తూ తిరుగుతున్న సుడిగుండాల్లాంటి ఆకారాలను గమనించి అప్పట్లో మాట్లాడడం జరిగింది.అయితే దీని గురించి నిపుణులు మాట్లాడుతూ, ‘రాకెట్ దాని అదనపు ఇంధనాన్ని అంతరిక్షంలోకి విడుదల చేయడంతోనే ఇది సంభవించింది.
ఆ ఇంధనం మేఘంలో స్తంభించిపోయింది.ఆ ఘనీభవించిన మేఘాన్ని సూర్య కిరణాలు తాకినప్పుడు, ఆకాశంలో కదులుతున్న గెలాక్సీ లాగా కనిపించే ప్రకాశవంతమైన సుడిగుండం లాంటి ఆకారం క్రియేట్ అవుతుంది.
’ అని చెప్పుకొచ్చారు.అదన్నమాట అసలు విషయం.యూకేలో ఆకాశంలో కనిపించిన విజువల్స్ కూడా అచ్చం ఇలానే ఉన్నాయి.ఇది న్యూజిలాండ్ ఘటన లాంటిదేనని భావించడానికి సమయం కూడా సరిపోతుంది.