ప్రపంచంలో డబ్బు ఆదా చేయడానికి రకరకాల పనులు చేస్తుంటారు.కానీ చైనాకు( China ) చెందిన ఓ యువతి చేసిన పని తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
ఆమె కేవలం డబ్బు ఆదా చేయడం కోసం ఏకంగా ఆఫీసు టాయిలెట్‌నే( Office Toilet ) తన ఇల్లుగా మార్చేసుకుంది.యాంగ్( Yang ) అనే 18 ఏళ్ల యువతి ఓ ఫర్నిచర్ స్టోర్‌లో పనిచేస్తోంది.
ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆ స్టోర్‌లోని బాత్రూమ్‌లోనే నివాసం ఉంటోంది.ఇందుకోసం తన బాస్‌కు నెలకు కేవలం 5 యువాన్లు (సుమారు రూ.545) చెల్లిస్తోందట.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు కథేంటంటే, యాంగ్ మొదట నెలకు 21 యువాన్లు (సుమారు రూ.2,290) ఇస్తానని ఆఫర్ చేసిందట.కానీ ఆమె మంచి మనసున్న బాస్, కేవలం నీళ్లు, కరెంట్ ఖర్చులకు సరిపడా ఆ చిన్న మొత్తాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు.నిజానికి, స్టోర్ యాజమాన్యం ఆమెకు ఉండటానికి ఆఫీస్‌లోనే ఓ గది ఇచ్చినా, దానికి డోర్ లేకపోవడంతో అసౌకర్యంగా ఉందని యాంగ్ భావించింది.
ఈ స్టోర్‌కు రాకముందు, ఆమె తన బాస్ ఇంట్లోనే కొంతకాలం ఉంది.

యాంగ్‌కు నెలకు 317 యువాన్లు (సుమారు రూ.34,570) జీతం వస్తుండగా, ఆమె కేవలం 42 యువాన్లు (సుమారు రూ.4,500) మాత్రమే ఖర్చు చేస్తోంది.మిగిలిన డబ్బు మొత్తాన్ని ఆదా చేస్తోంది.తన ఈ వినూత్న లైఫ్‌స్టైల్ గురించి చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘డౌయిన్’ ( Douyin )లో వీడియోలు పంచుకుంటోంది.
దీంతో ఆమెకు 16,000 మందికి పైగా ఫాలోవర్లు కూడా ఏర్పడ్డారు.
మరి ఆ బాత్రూమ్‌ను ఇంటిలా ఎలా మార్చుకుందంటే, టాయిలెట్ స్టాల్స్‌కు అడ్డంగా ఓ పెద్ద బట్టను వేలాడదీసి ప్రైవసీ ఏర్పాటు చేసుకుంది.
రాత్రిళ్లు పడుకోవడానికి ఓ ఫోల్డింగ్ బెడ్‌ను ఉపయోగిస్తోంది, అదే సమయంలో అది అడ్డుగోడలా కూడా పనిచేస్తుంది.వంట చేసుకోవడానికి పోర్టబుల్ స్టవ్‌ను వాడుతోంది.
తన వస్తువులను ఓ క్లాతింగ్ రైల్‌పై సర్దుకుంటోంది.

ఆమె షేర్ చేసిన ఓ వీడియోలో, బాత్రూమ్‌లోని ఓ అంచుపై నీట్‌గా సర్దిన కూరగాయలను కటింగ్ బోర్డుపై కోయడం చూడొచ్చు.బట్టలు కూడా అక్కడే ఉతుక్కుని, ఆరబెట్టడానికి బిల్డింగ్ పైకప్పును ఉపయోగిస్తోంది.అయితే, స్టోర్ పనిచేసే సమయంలో మాత్రం కస్టమర్లు, ఇతర ఉద్యోగులు బాత్రూమ్‌ను వాడుకునేందుకు వీలుగా తన వస్తువులన్నింటినీ ప్యాక్ చేసి పక్కన పెడుతుంది.
ఇంత సింపుల్‌గా, పొదుపుగా జీవిస్తున్నందుకు యాంగ్ ఏమాత్రం ఇబ్బంది పడటం లేదు, పైగా సంతోషంగానే ఉంది.భవిష్యత్తులో సొంతంగా ఇల్లు లేదా కారు కొనాలనేది ఆమె లక్ష్యం.
అందుకే ఇలా రూపాయి రూపాయి కూడబెడుతోంది.ఆమెకు అండగా నిలుస్తున్న బాస్ కూడా యాంగ్‌ను చూసి “మరీ ఇంత పొదుపా” అని సరదాగా అంటున్నాడట.