మన శరీరానికి అత్యంత అవసరమైన అలాగే ముఖ్యమైన పోషకాలలో క్యాల్షియం( Calcium ) ఒకటి.సాధారణంగా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండాలంటే మనకు క్యాల్షియం చాలా అవసరం అవుతుంది.
క్యాల్షియం లోపం ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.అలాగే ఈ క్యాల్షియం లోపాన్ని అధిగమించడానికి ఏం చేయాలి? ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.క్యాల్షియం లోపం ఉంటే కనిపించే లక్షణాలు నడుము నొప్పి,( Back Pain ) మోకాళ్ళ నొప్పులు,( Knee Pain ) గోల్లు విరిగిపోవడం, జుట్టు రాలిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.అయినప్పటికీ మనం గుర్తించలేక ఇబ్బందులు పడుతూ ఉంటాం.
కానీ ఒకప్పుడు తెలుగువారు వరి అన్నం కంటే తృణధాన్యాలకు ( Millets ) ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.వీటిలో విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి విలువైన పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి.
వీటిలో ఎక్కువ పోషక పదార్థాలు ఉండడం వలన శరీరానికి వ్యాధినిరోధక శక్తి లభిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే తృణధాన్యాలు అంటే నేటి తరానికి రాగులు, సజ్జలు, జొన్నలు అని మాత్రమే తెలుసు.
కానీ ఐదో దశాబ్దాల క్రితం మన దేశ రైతులు దాదాపు 50 రకాల తృణధాన్యాలు పండించేవారు.

అయితే క్రమమైన వాతావరణ మార్పులు, భూసారం లోపించడం వలన రైతుల్లో తృణధాన్యాలు పండించడంలో ఆసక్తి తగ్గిపోయింది.అయితే ఈ తృణధాన్యాలలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి.అలాగే పౌష్టిక విలువలు కూడా అధికంగా ఉన్నాయి.
అయితే కొన్ని సంవత్సరాలుగా తృణధాన్యాల వాడకం తగ్గింది.కాబట్టి ఎన్నో అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
అయితే రాగులు, సజ్జలు, ఉలువలు, అవిసలు, కొర్ర బియ్యం, అణువులు, బొబ్బర్లు లాంటివి తృణధాన్యాలకు చెందినవే.

ఇవి మన శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి.వీటితో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వీటిని ఆహారంగా తీసుకోవడం వలన నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.
అలాగే కాల్షియం లోపంతో బాధపడుతున్న వారు రాగి గంజి తీసుకోవడం వలన క్యాల్షియం పెరిగి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, చేతి తిమ్మిర్లు ఎప్పటికీ కూడా మీ దరి చేరవు.