ఇండియాలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే లభిస్తోంది.ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.
ఆయన చేసిన సినిమాలు అతన్ని గొప్ప స్థాయికి తీసుకురావడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా ఒక మంచి బిరుదును కూడా సంపాదించి పెట్టాయి.మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో పెద్ది( Peddi ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను ప్రభంజనాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.అయితే బుచ్చిబాబుతో చేస్తున్న ఈ పెద్ది సినిమాలో విలన్ గా ఒక స్టార్ హీరో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో ఇప్పటికే శివరాజ్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

మరి ఆయన కాకుండా ఈ సినిమాలో ఒక స్టార్ హీరో తో విలన్ పాత్రను పోషింప చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఆయన ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచుతున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాతో ఎవరు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…ఇక బుచ్చిబాబు ఈ సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…
.