1.గోధుమల ఎగుమతి పై భారత్ సడలింపులు
గోధుమల ఎగుమతిపై నిషేధం పై కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది ఈ నిషేధం పై సడలింపులు ఇచ్చింది.మే 13 లోపే కస్టమ్స్ అధికారుల పరిశీలనకు పంపినవి వారి సిస్టం లో నమోదైన గోధుమ ఎగుమతుల ఆర్డర్లను సంబంధిత దేశాలకు పంపడానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
2.ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది.
3.రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.రాజు హత్య కేసులో ముప్పై ఒక్క ఏళ్ల జైలు జీవితం గడిపిన ఏజ్ పెరారివలన్ ను చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
4.వనజీవి రామయ్య కు రోడ్డు ప్రమాదం
పద్మశ్రీ అవార్డు గ్రహీత ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ప్రస్తుతం ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
5.కొత్త మదరసాల అనుమతికి యోగి ప్రభుత్వం నిరాకరణ
ఇకపై ఉత్తర్ ప్రదేశ్ లో కొత్త మదరసాల ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే అనుమతులు నిరాకరించారని వచ్చిన ప్రతిపాదనకు యోగి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
6.రుణమాఫీ పై రేవంత్ హామీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 నెలల్లోనే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని, ఇందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
7.సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం
ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
8.తెలంగాణ హైకోర్టు కు సుప్రీంకోర్టు నోటీసులు
సెలవులు సమయంలో క్యాష్ రిట్ పిటిషన్లను వినకూడదనే నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
9.పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు వాయిదా
ఈ నెల 20 నుంచి ప్రారంభించాలని కున్న పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
10.నారాయణ కుటుంబ సభ్యుల బెయిల్ పిటిషన్ పై విచారణ
పదవ తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు శరణీ, సింధూర, అల్లుడు పునీత్ ముందస్తు పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ కేసుని రేపటికి వాయిదా వేసింది.
11.పెరిగిన వీసా దరఖాస్తులు
గతేడాదితో పోలిస్తే 2022లో ప్రపంచంలోని అనేక దేశాలకు వీసా దరఖాస్తులు పెరిగాయని పి ఎఫ్ ఎస్ గ్లోబల్ సౌత్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ జయ అమిత్ మిత్రా వెల్లడించారు.
12.బీజేపీ ని చిత్తశుద్దితో ఎదుర్కోవాలి :నారాయణ
కేంద్రంలో నిరంకుశ బిజెపి ని గద్దె దించడానికి రాజకీయంగా చిత్తశుద్ధితో ఎదుర్కోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు.
13.గీత కార్మికుల హామీల అమలుకు ఆందోళన : బీజేపీ
కల్లుగీత కార్మికులకు టిఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి పెంచేందుకు ఆందోళన చేపట్టాలని బిజెపి గీత సెల్ నిర్ణయించింది.
14.తండాలు, గూడేలకు రైతు డిక్లరేషన్
వరంగల్ రైతు డిక్లరేషన్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తండాలు గూడేల వరకు తీసుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
15.జూన్ 5 న నిరుద్యోగ రచ్చ బండ
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 5న రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ రచ్చబండ నిర్వహిస్తామని తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు.
16.షర్మిల కామెంట్స్
పంట వర్షానికి కొట్టుకుపోతుంటే రైతుల కన్నీరు పెడుతున్నారు అని మీరు కష్టాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
17.కోదండరామ్ కామెంట్స్
విద్యార్థి నేతలకు రాజకీయంగా అవకాశం కల్పించేది, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను గౌరవించేది టీజేఎస్ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.
18.పిల్లల ఎదుగుదల పర్యవేక్షణకు ప్రత్యేక కార్డులు
అంగన్వాడీ కేంద్రాల కు వెళుతున్న చిన్నారుల్లో ఎదుగుదల ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేసేందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఈ మేరకు ” పిల్లల పెరుగుదల పర్యవేక్షణ” కార్డును అధికారులు రూపొందించారు.
19.న్యాయ శాఖ కార్యదర్శిగా నర్సింగ్ రావు
తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శిగా వరంగల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నందికొండ నరసింహారావును డిప్యుటేషన్ పై నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
20.వైసీపీ పై వీర్రాజు విమర్శల
ఏపీ లో జరుగుతున్న అభివృద్ధి అంతా బిజెపి దేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.దేశంలో అతిపెద్ద మతతత్వ పార్టీ వైసీపీ అంటూ ఈ సందర్భంగా వీర్రాజు విమర్శించారు.