పాదాల పగుళ్లకు కార‌ణాలేంటి.. స‌హ‌జంగా ఎలా త‌గ్గించుకోవ‌చ్చు?

ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా చాలా మందిని క‌ల‌వ‌రపెట్టే స‌మ‌స్య‌ల్లో పాదాల ప‌గుళ్లు( Cracked Feet ) ఒక‌టి.పాదాల పగుళ్లకు అనేక కారణాలు ఉంటాయి.

 What Are The Causes Of Cracked Feet Details, Cracked Feet, Cracked Feet Treatme-TeluguStop.com

ప్ర‌ధానంగా పాదాలకు తగినంత తేమ లేకపోతే చర్మం కఠినంగా మారి, చివరకు పగుళ్లు ఏర్పడతాయి.అలాగే ఎక్కువసేపు నీటిలో ఉండటం, పోషక లోపాలు, అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు, ధూళి మ‌రియు కాలుష్యానికి గురికావడం, ఫిట్ కాని ఫుట్‌వేర్ ఉపయోగించడం వంటి కార‌ణాల వ‌ల్ల కూడా పాదాల పగుళ్లు ఏర్పడతాయి.

అయితే ఈ స‌మ‌స్య‌ను స‌హ‌జంగా ఎలా త‌గ్గించుకోవ‌చ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

రోజ్ వాట‌ర్( Rose Water ) మ‌రియు గ్లిజరిన్( Glycerine ) కాంబినేష‌న్ పాదాల ప‌గుళ్ల‌ను నివారించ‌డంతో తోడ్ప‌డుతుంది.

రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ లో వ‌న్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజ‌రిన్ మిక్స్ చేసి.నైట్ నిద్రించే ముందు పాదాల‌కు అప్లై చేసుకోవాలి.ఆపై మృదువైన సాక్స్ ధరించాలి.రెగ్యుల‌ర్ గా ఇలా చేశారంటే ప‌గుళ్లు క్ర‌మంగా త‌గ్గి పాదాలు మృదువుగా మార‌తాయి.

Telugu Banana, Cracked Feet, Crackedfeet, Care, Care Tips, Ghee, Glycerine, Late

అలాగే కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విట‌మిన్ ఇ స‌మృద్ధిగా ఉండే గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, న‌ట్స్ ను తీసుకోండి తీసుకోండి.రోజుకు ఎనిమిది గ్లాసుల వాట‌ర్ తాగండి.త‌ద్వారా పాదాల‌కు మంచి పోష‌ణ అందుతుంది.ప‌గుళ్లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Telugu Banana, Cracked Feet, Crackedfeet, Care, Care Tips, Ghee, Glycerine, Late

అర‌టి పండు పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.బాగా పండిన అర‌టి పండును( Banana ) మెత్త‌గా పేస్ట్ చేసి అందులో వ‌న్ టేబుల్ స్పూన్ నెయ్యి( Ghee ) క‌లిపి పాదాల‌కు ప‌ట్టించండి.అర‌గంట అనంత‌రం పాదాల‌ను మంచి మ‌సాజ్ చేసుకుని వాట‌ర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పాదాల ప‌గుళ్ల‌కు బై బై చెప్ప‌వ‌చ్చు.

రోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు మాయిశ్చరైజర్ లేదా గోరువెచ్చని కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ రాసి మృదువైన సాక్స్ ధరించండి.ఇలా చేసినా కూడా ప‌గుళ్లు మాయం అవుతాయి.

పాదాలు మృదువుగా మార‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube