దగ్గు విపరీతంగా వేధిస్తుందా.. ఇలా చేస్తే రెండు రోజుల్లో దెబ్బ‌కు ఎగిరిపోతుంది!

దగ్గు.( Cough ) అత్యంత సర్వ సాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.

 Super Powerful Drink To Get Relief Cough , Cough, Cough Relief Drink, Late-TeluguStop.com

అందులోనూ ప్రస్తుత వర్షాకాలంలో జలుబు ఆ వెంటనే దగ్గు పట్టుకుని ఓ పట్టాన వదిలిపెట్టవు.ఒకవేళ జలుబు తగ్గినా దగ్గు మాత్రం అంత త్వరగా పోదు.

దగ్గు వల్ల నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతుంటారు.పనిపై ఏకాగ్రత పెట్టలేకపోతుంటారు.

అస్తమాను దగ్గుతూనే ఉంటారు.ఎన్ని మందులు, టానిక్ లు వాడిన ఫలితం ఉండదు.

మిమ్మల్ని కూడా దగ్గు సమస్య విపరీతంగా వేధిస్తుందా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.

Telugu Cough, Tips, Latest, Powerful-Telugu Health

ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను కనుక తాగితే రెండు రోజుల్లో దెబ్బకు దగ్గు ఎగిరిపోతుంది.మరి ఇంకెందుకు లేటు దగ్గును తగ్గించే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి.వాటర్ రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసుకోవాలి.

అలాగే ఐదు నుంచి ఆరు మిరియాలను( Black Pepper ) దంచి వేసుకోవాలి.

Telugu Cough, Tips, Latest, Powerful-Telugu Health

చివరిగా వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము ( Ginger )మ‌రియు రెండు త‌మ‌ళ‌పాకులు తుంచి వేసి బాగా మరిగించాలి.వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆపై స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే.

మన డ్రింక్ సిద్ధం అయినట్టే.ఈ డ్రింక్ ను రోజుకు రెండుసార్లు అంటే ఉదయం మరియు సాయంత్రం తీసుకోవాలి.

ఇలా కనుక చేస్తే దగ్గు, జలుబు వంటి సమస్యలు చాలా త్వరగా దూరం అవుతాయి.ఈ డ్రింక్ లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మ‌న రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యల‌తో బాధపడే వారికి ఈ డ్రింక్ ఒక న్యాచురల్ మెడిసిన్ లో పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube