ఈ డ్రింక్స్ తాగితే అలసట దూరమై.. శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుందా..!

సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలా మంది యువత కాస్త అలసిపోయినా టీ లేదా కాఫీ( Coffee ) తాగుతూ ఉంటారు.ఇది వారి అలసటను దూరం చేసి వారికి వెంటనే తాజా అనుభూతిని కలిగిస్తుందని వారి నమ్మకం.

 If You Drink These Drinks, Fatigue Will Go Away Will The Body Get Energy Immedi-TeluguStop.com

కానీ టీ లేదా కాఫీ మిమ్మల్ని కొద్ది సేపు మాత్రమే ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.తర్వాత మీరు మళ్ళీ అలసిపోతూ ఉంటారు.

అందుకే సహజసిద్ధమైన ఎనర్జీ డ్రింక్స్( Energy drinks ) తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇవి విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంటాయి.

ఈ ఎనర్జీ డ్రింక్స్ మిమ్మల్ని రోజు మొత్తం తాజాగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అలాంటి ఎనర్జీ డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి మిల్క్ షేక్( Banana milk shake ) నీ తయారు చేయడానికి అరటిపండు, బాదం, జీడిపప్పు ఇతర డ్రై ఫ్రూట్స్ లను మిక్సీలో మెత్తగా రుబ్బాలి.తర్వాత ఈ మిశ్రమాన్ని పాలలో కలుపుకొని త్రాగాలి.

అరటి పండులో పొటాషియం వంటి అనేక ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

ఉదయాన్నే అరటి పండుతో చేసిన షేక్ తాగడం వల్ల మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు.ఇంకా చెప్పాలంటే దానిమ్మలో విటమిన్లు, సి, కే, ఈ,మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.ఈ డ్రింక్ ప్రతి రోజు త్రాగడం వల్ల రక్తపోటు,కొలెస్ట్రాల్ నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ డ్రింక్ తక్షణమే అలసటను దూరం చేస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో నిమ్మరసం త్వరగా శరీరానికి ఎనర్జీని అందిస్తుంది.అంతే కాకుండా దీనిని తయారు చేయడం కూడా ఎంతో సులభం.అలాగే నిమ్మకాయ ధర కూడా మార్కెట్లో కాస్త తక్కువ ధరకే లభిస్తుంది.

దీనిని ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు తాగితే శరీరంలో ఉన్న అలసట దూరమై తక్షణమే శక్తిని అందిస్తుంది.కాబట్టి అలసటగా ఉన్నవారు ఈ ఎనర్జీ డ్రింక్స్ ని త్రాగడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube