వ‌ర్షాకాలంలో ఈ వెజిటబుల్ జ్యూస్ తాగితే ఆరోగ్యం, అందం రెండు పెరుగుతాయి!

అస‌లే ఇప్పుడు వ‌ర్షాకాలం కొన‌సాగుతోంది.సీజ‌న్ మారిన‌ప్పుడ‌ల్లా వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు మ‌న శ‌రీరాన్ని ప్ర‌భావితం చేస్తాయి.

 If You Drink This Vegetable Juice During Monsoons, Both Health And Beauty Will I-TeluguStop.com

అందులో ఎటువంటి సందేహం లేదు.అలాగే ఈ వ‌ర్షాకాలంలోనూ వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు, వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

వాటి నుండి ర‌క్ష‌ణ పొందాలంటే ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.తీసుకునే ఫుడ్‌ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

అయితే ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ఇప్పుడు చెప్ప‌బోయే వెజిటబుల్ జ్యూస్‌ను గ‌నుక తీసుకుంటే ఆరోగ్యం, అందం రెండు పెర‌గ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ వెజిటబుల్ జ్యూస్ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బీట్ రూట్‌, ఒక క్యారెట్‌, ఒక కీర‌దోస‌ను తీసుకుని తొక్క చెక్కేసి ఉప్పు నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఒక టామోటోను కూడా తీసుకుని సాల్ట్ వాట‌ర్‌తో వాష్ చేసి స్లైసెస్‌గా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్క‌లు, క్యారెట్ ముక్క‌లు, కీర ముక్క‌లు, ట‌మాటో స్లైసెస్, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, ఒక గ్లాస్ వాట‌ర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ సిద్ధం అవుతుంది.

Telugu Beetroot, Carrot, Cucumber, Tips, Latest, Skin Care, Tomato, Vegetable-Te

వారంలో క‌నీసం రెండు సార్లు అయినా ఈ వెజిటబుల్ జ్యూస్‌ను తీసుకుంటే రోగ నిరోధక వ్యవ‌స్థ సూప‌ర్ స్ట్రోంగ్‌గా మారుతుంది.దాంతో జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ, వైర‌ల్ ఫీవ‌ర్స్ వంటి సీజ‌న‌ల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.అలాగే ఈ వెజిటబుల్ జ్యూస్‌ను డైట్ లో చేర్చుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా ప‌ని చేస్తుంది.ర‌క్త‌హీనత స‌మ‌స్య దూరం అవుతుంది.డ్రై స్కిన్, డ‌ల్ స్కిన్ వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ నిగారింపుగా మెరుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube