చిన్నప్పుడు పిల్లలు ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దుగా ఉన్నట్లు మురిసిపోతారు .లావుగా ఉండే పిల్లలను చూపిస్తూ, సన్నగా ఉండే పిల్లలను కోప్పడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు .
కాని బొద్దుగా ఉన్నారని మురిసిపోతున్నారంటే , అది తెలివితక్కువతనమే అని చెబుతున్నాయి సరికొత్త అధ్యయనాలు .
చిన్ననాటి నుండే, ఫీట్ నెస్ అతి ముఖ్యమైన విషయమని యునివర్సిటి అఫ్ జార్జియా కాలేజ్ ఒక రీసర్చ్ లో తేల్చి చెప్పింది .1700 మందియువతి యువకులపై వారు రకరకాల ప్రయోగాలు చేసారు .అందులో కొంతమంది చిన్నప్పుడు లావుగా ఉన్నవారు , కొందరు ముందు నుంచే ఫీట్ గా ఉన్నవారు .రిసర్చ్ తరువాత వారు చెప్పిందేంటంటే , చిన్ననాటి నుంచే ఫీట్ గా ఉన్నవారికి గుండే సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 36% తక్కువట .రివర్స్ లో చెబితే, చిన్నప్పుడు లావుగా ఉండి , ఇప్పుడు ఫీట్ గా ఉన్నవారికి గుండే సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 36% ఎక్కువ.ఇక అప్పుడూ, ఇప్పుడూ, లావుగా ఉన్నవారికి సంగతి మరింత ఘోరం .
అందుకే, చినప్పుడు లావుగా ఉన్నవాళ్ళని ముద్దు చేయడం మానేసి, ఫీట్ గా ఉంచడానికి ప్రయత్నించండి .ఫిట్ నెస్ మెయింటేన్ చేయడం అనేది అప్పటినుంచి నేర్పితేనే పిల్లలకు బాగా అలవాటు అవుతుంది, పెద్దయ్యాక కూడా ఫీట్ నెస్ మీద ధ్యాస ఉంటుంది .తల్లిదండ్రుల్లారా … వింటున్నారా ?
.