టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )చివరగా పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఈ సినిమాతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.దీంతో బన్నీ తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంపై అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.ఈ మూవీని పక్కన పెట్టి బన్నీ తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీతో( Atlee ) సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతున్నది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
చాలా రోజులుగా బన్నీతో అట్లీ సినిమా చేయాలనుకుంటున్నాడు.ఇద్దరి కాంబోలో హై యాక్షన్ సినిమా( Action movie ) తెరకెక్కించనున్నట్లు టాక్ నడుస్తోంది.త్వరలోనే వివరాలను ప్రకటించనున్నారు.ఇక అల్లు అర్జున్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు.జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని వార్తలు వచ్చాయి.దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
సెకండ్ పార్ట్ లోనైనా జాన్వీ పాత్రకు న్యాయం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇకపోతే జాన్వి కపూర్ విషయానికొస్తే.
ఈమె ఇటీవల దేవర మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల ఈ మంచి సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం రామ్ చరణ్ సరసన సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.