డిసెంబర్ 13 వ తేదీన పోలీస్వర్గంతో కార్తీకమాసం ముగింపు..!

డిసెంబర్ 12వ తేదీన కార్తీక అమావాస్య వచ్చింది.డిసెంబర్ 13 పోలి పాడ్యమి( Poli Padyami ).

 End Of Kartik Month With Poli Padyami On 13th December ,poli Padyami ,karti-TeluguStop.com

ఈరోజుతో కార్తీకమాసం పూర్తి అయ్యి మార్గశిర మాసం మొదలవుతుంది.అసలు పోలీ స్వర్గం అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట.వారిలో చిన్న కోడలు పేరు పోలి ఆమెకు చిన్నప్పటినుండి దైవభక్తి ఎక్కువగా ఉండేది.కానీ అది అత్తకు నచ్చేది కాదు.ఎందుకంటే తనకంటే భక్తురాలు మరొకరు ఉండకూడదని, నిజమైన భక్తురాలు అవ్వాలని ఆమె అహంకారంతో ఉండేది.

కాబట్టి చిన్న కోడలైన పోలితో పూజలు చేయించకుండా కార్తీకమాసం వచ్చినప్పుడు మిగిలిన కోడలను తీసుకొని నదికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించుకొని పూజలు చేయించేది.

Telugu Bhakti, Devotional, Karthika Deepam, Kartika Maasam, Padyami, Poliswargam

కానీ పోలిని పట్టించుకునేది కాదు.పైగా తనకు ఎలాంటి సౌకర్యం లేకుండా చేసేది కూడా.కానీ పోలి మాత్రం బాధపడేది కాదు.

అత్తగారు తోడికోడళ్ళు అటు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది.ఆ దీపం ఎవరి కంట పడకుండా దానిపై బుట్ట బొరలించేది.

ఇలా కార్తీకమాసం అంతా సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి నిత్యం దీపారాధన చేసేది.చివరికి కార్తీక అమావాస్య పూర్తయి పోలీస్వర్గం వచ్చేసింది.

Telugu Bhakti, Devotional, Karthika Deepam, Kartika Maasam, Padyami, Poliswargam

ఆ రోజు కూడా అందరూ నదికి వెళ్ళిపోతూ పోలికు చేతినిండా పని అప్పగించి వెళ్ళిపోయారు.కానీ ఎప్పటిలా ఇంటి పనులు పూర్తిచేసుకుని, కార్తీకదీపం( Karthika Deepam ) వెలిగించింది.ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలి భక్తి తప్పకపోవడం చూసి దేవతలంతా ఆమెను దీవించారు.ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానం తో వచ్చారు.అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, తోడికోడళ్ళు పుష్పక విమానాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు.అది తమ కోసమే వచ్చిందని అనుకున్నారు.

కానీ అందులో పోలిని చూసి నిర్ధాంతపోయారు.తాము కూడా స్వర్గానికి వెళ్లాలని తాపత్రయంతో పోలి కాళ్లు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు.

అయినా ఫలితం లేకపోయింది.విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన భక్తి ఉందని చెప్పి వారిని కిందనే వదిలేసి పోలిని తీసుకొని వెళ్ళిపోయారు.

ఇక కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగింది.పోలి కథను చెప్పుకొని ఆమెలా స్వర్గానికి తమకు కూడా పర్యవేశం కల్పించాలని భక్తులు ప్రార్థిస్తారు.

ఇక నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించని వారు కనీసం పోలి పాడ్యమి రోజైనా 30 వత్తులను వెలిగించి, అరటి దొప్పల్లో పెట్టి నీటిలో వదులుతారు అలాగే ఆరోజు బ్రాహ్మణులకు దీప దానం కూడా చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube