సాధారణంగా చాలామంది ప్రజలు డబ్బు సంపాదన కోసం వ్యాపారం వైపే అడుగులు వేస్తున్నారు.ఉద్యోగం చేసే కంటే వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నారు.
బాస్ తో బాధలు పడే కన్నా, సేలవుల కోసం వారిని అడిగి కన్నా నచ్చిన పనిని ఎంతో ఇష్టంగా చేసుకోవచ్చని చాలామంది ప్రజలు భావిస్తున్నారు.ఈ విధంగానే లక్షలు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నారు.
వ్యాపారంలో కొందరికి లాభాలు వేస్తే మరికొందరు నష్టాల్లో కురుకపోతున్నారు.ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అయితే దీనికి చిన్న చిన్న వాస్తు నియమాలే కారణం కావచ్చని వాస్తు శాస్త్రాన్ని నిపుణులు చెబుతున్నారు.మరి వ్యాపారంలో లాభం రావాలంటే ఏమి చేయాలి ఎలాంటి జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఆఫీసు లేదా ఫ్యాక్టరీకి తెలుపు లేదా క్రీమ్ రంగులను వేయించాలి.ఈ రంగుల నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.దాని వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది.ఆఫీస్ దుకాణం లేదా ఫ్యాక్టరీలో ఉత్తర దిశను కుబేరుడి దిశగా భావిస్తారు.
అందుకే మీ డబ్బు పెట్టెను ఉత్తర దిశలో మాత్రమే ఉంచడం మంచిది.దాని వల్ల మీరు డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
ఇంకా చెప్పాలంటే ఆఫీసు లేదా షాప్ ప్రధాన తలుపులను తెరిస్తే అవి లోపలి వైపునకు వెళ్లేలా ఉండాలి.

కిటికీలు, తలుపులు పగలకుండా ఆ కచ్చితమైన స్థితిలో ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో మంచిది.ఒకవేళ అవి విరిగిపోయిన పగిలిపోయిన వెంటనే వాటికి రిపేరు చేయించాలి.కార్యాలయంలో మీ మీటింగ్ హాలులో దీర్ఘ చతురస్రాకారపు టేబుల్‌ను ఉంచుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే దుకాణాల్లో కూడా ఇలాంటి టేబుల్స్ ని ఉంచుకోవడం మంచిది.వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే మీ టేబుల్ పై శ్రీ యంత్రం, వ్యాపారవృద్ది యంత్రం, క్రిస్టల్ తాబేలు ,క్రిస్టల్ బాల్, ఏనుగు మొదలైన వాటిని ఉంచుకోవడం మంచిది.