ఎన్ని చేసినా ఫేస్ ట్యాన్ పోవ‌డం లేదా? అయితే మీకోస‌మే ఈ రెమెడీ!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్‌ సీజ‌న్‌లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే స‌మ‌స్య స‌న్ ట్యాన్‌.ముఖ్యంగా ముఖం మండే ఎండ‌ల కార‌ణంగా త‌ర‌చూ ట్యాన్ అయిపోతూనే ఉంటుంది.

 Effective Home Remedy For Face Tan Details! Home Remedy, Face Tan, Sun Tan, Late-TeluguStop.com

దాంతో ముఖంలో కాంతి మొత్తం పోయి అంద‌విహీనంగా క‌నిస్తుంది.ఈ క్ర‌మంలోనే ఫేస్ ట్యాన్‌ను నివారించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే ఒక్కోసారి ఎన్ని చేసిన ట్యాన్ పోదు.అలాంటి స‌మ‌యంలో ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ రెమెడీని గ‌నుక ట్రై చేస్తే ట్యాన్ స‌మ‌స్య నుంచి సుల‌భంగా విముక్తి పొందొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఇన్‌స్టెంట్ గ్రీన్ టీ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్‌ కోకో పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కోకన‌ట్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి డైరెక్ట‌ర్‌గా అప్లై చేసుకుని ప‌ది నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.ఆ వెంట‌నే వేళ్ల‌తో స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ నార్మ‌ల్ వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

Telugu Aloe Vera Gel, Tips, Cocoa Powder, Coconut Oil, Curd, Face Tan, Remedy, L

ఇలా రోజుకు ఒక సారి చేస్తే ట్యాన్ పోయి ముఖం అందంగా, గ్లోయింగ్‌గా మారుతుంది.అలాగే చ‌ర్మంపై పేరుకుపోయిన డెస్ట్ మ‌రియు డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొల‌గిపోయాయి.

ఈ రెమెడీతో పాటు ట్యాన్ స‌మ‌స్య‌కు దూరంగా ఉండాల‌నుకుంటే బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరిగా రాసుకోవాలి.శ‌రీరం మొత్తం క‌ప్పి ఉన్న దుస్తుల‌నే ధ‌రించాలి.

విటమిన్‌-సి పుష్క‌లంగా ఉండే నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ, కివీ, జామ వంటి వాటిని తరచూ తీసుకోవాలి.మ‌రియు శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube