ఇటీవల కాలంలో పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, కంటి నిండా నిద్ర లేకపోవడం, చెడు వ్యసనాలు తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే ఎంతో మంది ముడతలు, చర్మం సాగటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.ఇవి అందం మొత్తాన్ని పాడుచేస్తాయి.
పైగా ముడతలు, చర్మం సాగటం( Wrinkles, skin stretching ) వల్ల చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తారు.అందుకే ఆయా సమస్యలను వదిలించుకోవడం కోసం ముప్పతిప్పలు పడుతుంటారు.
అయితే పైసా ఖర్చు లేకుండా ముడతలను మాయం చేసి స్కిన్ ను టైట్ గా మార్చే సూపర్ రెమెడీ ఒకటి ఉంది.ఆ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న ఉడికించిన చిలగడదుంప ( Boiled sweet potato )తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే చిన్న టమాటో( Tomato ) కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ లో ఉడికించిన చిలగడదుంప ముక్కలు మరియు టమాటో ముక్కలు వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి( wheat flour ) , వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి( Multani soil ), వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒకసారి కనుక చేశారంటే మళ్లీ మీరు మీ యవ్వనమైన చర్మాన్ని పొందుతారు.ఈ రెమెడీ చర్మం పై ఏర్పడిన ముడతలను సమర్థవంతంగా మాయం చేస్తుంది.అలాగే సాగిన చర్మాన్ని సూపర్ టైట్ గా మారుస్తుంది.స్కిన్ ను లోతుగా శుభ్రం చేసి కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మొండి మచ్చలు ఏమైనా ఉంటే మాయమవుతాయి.
మరియు చర్మం ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా సైతం మెరుస్తుంది.