లావుగా ఉన్నామని బాధపడొద్దు.. ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే నాజూగ్గా మారడం ఖాయం!

ఇటీవల కాలంలో అధిక బరువు సమస్య కోట్లాది మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.బరువు పెరగడం వల్ల శరీర ఆకృతి దెబ్బతింటుంది.

 This Is A Magical Drink That Can Reduce Excess Weight! Magical Drink, Weight Los-TeluguStop.com

ఎన్నో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.అలాగే అద్దంలో చూసుకున్నప్పుడల్లా లావుగా ఉన్నామే అని మానసిక ఆందోళనకు గురవుతుంటారు.

ఈ క్రమంలోనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు.దీనికి తోడు ఇరుగు పొరుగు వారు చేసే కామెంట్లు మరింత వేదనకు గురి చేస్తుంటాయి.

అయితే ఇకపై లావుగా ఉన్నామని అస్సలు బాధపడొద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్‌ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే కేవలం కొద్ది రోజుల్లోనే మీరు నాజూగ్గా మార‌డం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, వన్ టేబుల్ స్పూన్ సోంపు, పావు టేబుల్ స్పూన్ కరక్కాయ పొడి వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Burn, Tips, Latest, Magical-Telugu Health Tips

ఆ తర్వాత చిటికెడు బ్లాక్ సాల్ట్, చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ వేసుకుని ఒక నిమిషం పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్‌ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడిని కలిపి సేవించాలి.

ఈ డ్రింక్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు లేదా నైట్ నిద్రించడానికి గంట ముందు తీసుకోవాలి.ఇలా ఎలా తీసుకున్నా శరీరంలో క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.

దాంతో లావుగా ఉన్న మీరు కేవలం కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారతారు.అధిక బరువుతో సతమతం అయ్యే వారికి ఇది బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు.

కాబట్టి ఎవరైతే అధిక బరువు సమస్యతో సతమతం అవుతున్నారు వారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube