ఓట్స్.( Oats ).ఇటీవల కాలంలో చాలా మందికి ప్రధాన ఆహారంగా మారిపోయింది.న్యూట్రియంట్ విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఓట్స్ తో రకరకాల వంటలు తయారు చేసుకుని బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ లో తీసుకుంటున్నారు.
ఓట్స్ తో స్నాక్స్ కూడా చేసుకుంటున్నారు.బరువు నిర్వాహణలో, హృదయ ఆరోగ్యాన్ని కాపాడటంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఓట్స్ చాలా అద్భుతంగా తోడ్పతాయి.ఓట్స్ ఆరోగ్యకరమే.కానీ కొందరు వ్యక్తులు మాత్రం వాటిని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఆ కొందరు ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఓట్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ( Blood sugar levels )ను తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడతాయి.
కానీ, రక్తంలో చక్కెర స్థాయిలు ఇప్పటికే తక్కువగా ఉంటే ఓట్స్ తీసుకోవడం శ్రేయస్కరం కాదు.అలాంటి వారు ఓట్స్ తింటే షుగర్ లెవల్స్ మరింత డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అలాగే ఓట్స్‌లో ఉండే అవెనిన్ అనే ప్రొటీన్ వల్ల కొంతమందికి అలెర్జీ వచ్చే అవకాశం ఉంది.అంటే చర్మంపై దద్దుర్లు, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు.
అలాంటి వారు కూడా ఓట్స్ ను తినకపోవడమే బెటర్.
ఓట్స్‌లో ఆక్సలేట్స్ కొద్ది మొత్తంలో ఉంటాయి.అందువల్ల ఆక్సలేట్ ఆధారంగా స్టోన్స్ వచ్చే వారికి ఓట్స్ మంచి ఎంపిక కాకపోవచ్చు.ఓట్స్ కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం( Bloating, gas, constipation ) లేదా కడుపులో ఇబ్బంది వంటి సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది.
ఓట్స్ ను పచ్చిగా తినడం లేదా అధిక మొత్తంలో తినడం వల్ల ఇలా జరగొచ్చు.ఓట్స్ తినేటప్పుడు నీరు తగినంతగా తాగకపోయినా జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఓట్స్ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, వాటికి చక్కెరతో కలిసి తీసుకుంటే మాత్రం బరువు పెరుగుదలకు దారి తీస్తుంది.ఇక ఓట్స్‌లో ఫిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల అతిగా ఓట్స్ తింటే ఐరన్, జింక్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను శరీరం గ్రహించకుండా ఫైటిక్ యాసిడ్ నిరోధించవచ్చు.ఇది రక్తహీనత, అలసట మరియు బోలు ఎముకల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.