సాధారణంగా కొంత మంది ప్రజలకు ఏ పని మొదలు పెట్టిన ఆ పనిలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి.దీని వల్ల విసిగిపోయి తమ పై శని ప్రభావం ఉందని చాలామంది ప్రజలు బాధపడుతూ ఉంటారు.
అలాంటి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల వారు ఏ పని మొదలుపెట్టిన అందులోనీ ఆటంకాలు దూరమైపోతాయి. శని దేవునికి నువ్వు లతో దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందికి ఏ చిన్న పని మొదలుపెట్టిన అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు చేసినా కూడా వారి జీవితంలో ముందుకు సాగవు.ఏదో ఆటంకం, ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయి.అటువంటివారు ఈ విధంగా చేయడం వల్ల ఈ సమస్యలన్నీ దూరమైపోతాయి.
ఇలా శని దేవునికి దీపం వెలిగించేటప్పుడు ఎంతో పరిశుభ్రంగా ఉండి ఈ కార్యాన్ని చేయడం మంచిది.

ప్రతి దేవాలయంలో నవ గ్రహాలు కచ్చితంగా ఉంటాయి.ఆ నవగ్రహాల ముందు ప్రతి శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ దూరమైపోతాయి.అంతే కాకుండా శనీశ్వరుడికి బెల్లం అంటే ఇష్టం.
అందువల్ల బెల్లం తో చేసిన నైవేద్యం సమర్పించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని వేద పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే నల్లటి గుడ్డలో నల్లని నువ్వులను మూటకట్టి ప్రమిదలో వేసి ఒత్తులను చేసి దీపం వెలిగించిన శని చెడు ప్రభావం దూరం అయిపోతుంది.

అంతేకాకుండా నవగ్రహాల చుట్టూ 9 ప్రదీక్షనలు చేసి కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కొని శివాలయం లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే శని ప్రభావం దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.ఈ విధంగా ప్రతి శనివారం చేస్తూ ఉండడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులపై ఉన్న శని ప్రభావం కూడా దూరమై పోతుంది.దాని వల్ల కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో ఆనందంగా జీవిస్తారు.
LATEST NEWS - TELUGU