ఇటీవల నుంచి చలికాలం( Winter Season ) మొదలైపోయింది.కాలం మారడంతో వాతావరణ మార్పులకు మన శరీరంలో ఎన్నో మార్పులు వచ్చి జలుబు, దగ్గు లాంటివి వచ్చి అందరినీ ఆందోళన పెడుతుంది.
అయితే చలికాలంలో చలి తీవ్రంగా ఉన్నప్పుడు వ్యాధుల నుండి రక్షించుకోవడానికి మనం ఎన్నో మార్పులు చేస్తూ ఉంటాం.ధరించే దుస్తూలే కాకుండా పాటించే జీవనశైలిలో కూడా చిన్న చిన్న మార్పుల ద్వారా చలికాలంలో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు( Cold Cough ) లాంటి వాటికి దూరంగా ఉండవచ్చు.
అయితే చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి.చలికాలంలో వెచ్చదనం అవసరం ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో మనం తినే డైట్ లో మార్పులు చేసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన వేడిని పుట్టించవచ్చు.ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన శారీరకంగా ధృడంగా ఉంటారు.అయితే ఏ ఏ ఆహారాలు చలికాలంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.చాలామందికి భోజనం చేసిన తర్వాత ఏదో ఒక తీపి తినాలనిపిస్తూ ఉంటుంది.అయితే చలికాలంలో అన్నం తిన్న తర్వాత స్వీట్ దొరికితే మరింత ఆనందం కలుగుతుంది.అలాంటి పరిస్థితిలో బెల్లం తినవచ్చు.
బెల్లం( Jaggery ) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.బెల్లం తినడం వలన శరీరంలో వేడి నిల్వ ఉంటుంది.
అదనంగా శరీరంలో ఐరన్ లోపం( Iron Deficiency ) ఉన్న కూడా ఆ కొరత తీరిపోతుంది.ఇక పడుకునే ముందు బెల్లం తింటే రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.
అలాగే ఇది రోగ నిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది.రోజు బెల్లం తినడం వలన కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక నెయ్యి ఆరోగ్యాన్ని మరింత మేలు చేయడానికి బాగా పనిచేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే చలికాలంలో దేశీ నెయ్యి కలిపి ఎలాంటి పప్పులో అయినా తినవచ్చు.

రోజు తినే రోటీ, పరోటా లేదా బ్రెడ్ లాంటి పైన కూడా నెయ్యి( Ghee ) రాసుకొని తినవచ్చు.నెయ్యి సులభంగా జీర్ణమవుతుంది.కాబట్టి నెయ్యి తినడం వలన రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.ఈ చలికాలంలో జలుబు, దగ్గు నుండి కూడా నెయ్యి రక్షిస్తుంది.కానీ ఎక్కువ మోతాదులో మాత్రం తీసుకోవడం మంచిది కాదు.చలికాలంలో తేనెను ఆహారంలో సులభంగా కలుపుకోవచ్చు.
ఎందుకంటే తేనెలో శరీరానికి వేడి అందించే గుణాలు ఉన్నాయి.జలుబు,దగ్గును తగ్గించేందుకు కూడా తేనెను ఉపయోగిస్తారు.