హేమ సుందర్.తెలుగు సినిమా రంగంలో పేరొందిన నటుడు.
విలక్షణ పాత్రలతో ఎంతగానో ఆకట్టుకున్న నటుడు.ఆయన ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా 1981లో ప్రేమ సింహాసనం అనే సినిమాలో నటించాడు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తాతగా తాను నటించాడు.ఈ సినిమా సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు జరిగినట్లు వెల్లడించాడు హేమ సుందర్.ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు.బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో నటించాలని స్వయంగా ఎన్టీఆర్ ఆయనను కోరినట్లు చెప్పాడు.అంతటి మహానటుడు తనకు ఆఫర్ ఇవ్వడం పట్ల ఎంతో సంతోష పడ్డాడట ఆయన.కాసేపటి తర్వాత సిగ్గు పడినట్లు వెల్లడించాడు.ఎన్టీఆర్ కు తాను తాతగా నటించడమా? అని మదిలో అనుకున్నాడట.అయినా ఈ పాత్ర చేసేందుకు ఆయన ఓకే చెప్పాడట.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చెన్నై భరణి స్టూడియోలో జరుగుతుందట.
ఇంటి దగ్గరే మేకప్ వేసుకుని ఎన్టీఆర్ లొకేషన్ కు వచ్చాడట.అక్కడున్న వాళ్లంతా ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నారట.
అటు హేమ సుదంర్ కు మాత్రం పాదాభివందనాలు చేయడం అంటే అస్సలు నచ్చదట.అందుకే అక్కడి నుంచి నెమ్మదిగా లోపలికి వెళ్లిపోయాడట.
కాసేపయ్యాక షూటింగ్ మొదలయ్యింది.హేమ సుందర్ తొలి సీన్.
ఎన్టీఆర్ కు హేమచందర్ ను పరిచయం చేశాడు దర్శకుడు.ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు.
డైరెక్టర్ సీన్ చెప్పగానే సరే అన్నాడు ఎన్టీఆర్.కనీసం రీహార్సల్స్ లేకుండానే డైరెక్ట్ టేక్ చేద్దామని చెప్పాడు.
అయితే హేమ సుందర్ కు కాసేపు భయం అనిపించింది.వెంటనే తన పరిస్థితిని గమనించిన దర్శకుడు.
అతడి కోసం ఓ రీహార్సల్స్ సర్ అన్నాడు.ఎన్టీఆర్ సరే అన్నాడు.
ఈ సీన్ లో ఎన్టీఆర్ ఫారిన్ నుంచి ఇంటికి వస్తాడు.వస్తూనే తాతా.
తాతా అంటూ పిలుస్తాడు.రాగానే.
తన సూట్ కేసు లోనేంచి మెడిసిన్స్ తీసి ఆయన చేతికి ఇస్తాడు.ఇద్దరి మధ్య కాసేపు సంభాషనలుంటాయి.

రిహార్సల్స్ అయిపోగానే టేక్ మొదలయ్యింది.ఎన్టీఆర్ ఇంట్లోకి వస్తూనే తాతా.తాతా అని పిలుచుకుంటూ వస్తాడు.తన చేతిలోని బ్రీఫ్ కేసును పైకెగరేసి.మళ్లీ పట్టకుంటాడు.వెంటనే వచ్చి ఎన్టీఆర్ హేమ సుందర్ కాళ్లకు మొక్కుతాడు.
అంతే తను అవాక్కవుతాడు.రీహార్సల్స్ చేసినప్పుడు పాదాభివందనం లేదు.
కానీ టేక్ లో ఎన్టీఆర్ అలా చేశాడు.మొత్తానికి అక్కడితే టేక్ ఓకే అవుతుంది.
డైరెక్టర్ కట్ చెప్తాడు.ఈ సీన్ తన జీవితంలో మర్చిపోలేను అని వెల్లడించాడు హేమ సుందర్.