వేసవి కాలం ప్రారంభం అయినప్పుడు, ఎండల దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతారు.బయట కాలు పెట్టేందుకే జంకుతారు.
అయితే ఈ వేసవి కాలంలో వాతావరణ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం తరచూ వేడికి గురవుతుంది.దాంతో తలనొప్పి, మైకం, వాంతులు, అలసట, చెమట ఎక్కువగా పట్టడం, నోటి పూత, చికాకు వంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అందుకే శరీర వేడిని ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిది.అయితే శరీర వేడిని తగ్గించడంలో బెండకాయ అద్భుతంగా సహాయపడుతుంది.
మన దేశంలో అత్యధికంగా వాడే కూరగాయల్లో బెండకాయ ఒకటి.మన భారతీయులు బెండకాయతో ఎన్నో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.
బెండకాయతో ఏ వంటకం చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.అయితే రుచిలోనే కాదు బెండకాయలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.
విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు బెండకాయలో ఉంటాయి.
అందుకే బెండకాయను వారానికి రెండు తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
ముఖ్యంగా ఒంట్లో వేడి చేసిన వారు.రెండు బెండ కాయలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి.ఒక గ్లాస్ వాటర్‌లో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
ఇలా చేస్తే బెండకాయలో ఉండే పోషకాలు అన్నీ వాటర్‌లోకి దిగుతాయి.ఆ వాటర్‌ను ఉదయాన్నే సేవించాలి.
సమ్మర్ సీజన్‌లో ఇలా రెగ్యులర్‌గా చేస్తే శరీరంలో వేడి తగ్గు ముఖం పట్టి చల్లబడుతుంది.

అలాగే కంటి చూపు తగ్గుతుందని భావిస్తున్న వారు.బెండకాయలు నానబెట్టిన వాటర్‌ను తీసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇక ఈ వాటర్ తీసుకోవడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది.