నాగచైతన్య, సమంత( Naga Chaitanya, Samantha ) కాంబినేషన్ లో తెరకెక్కిన ఏ మాయ చేశావె మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.సమంత “శుభం” మూవీ( Shubham ) ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్ కు పెద్ద పీట వేస్తారని అన్నారు.
మంచి కథ ఉన్న సినిమాలను వాళ్లు ఆదరిస్తారని ఆమె చెప్పుకొచ్చారు.మనస్సుకు హత్తుకునే కంటెంట్ తో ఉన్న మా సినిమాను సైతం వాళ్లు ఆదరించాలని కోరుకుంటున్నానని సామ్ తెలిపారు.
నటీనటులందరూ కొత్తవాళ్లే అయినా అద్భుతంగా యాక్ట్ చేశారని అమె చెప్పుకొచ్చారు.వాళ్ల నటన నాకెంతో నచ్చిందని సమంత పేర్కొన్నారు.నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలో నాకు యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.నేను నటించిన మొదటి రెండు సినిమాలను చూస్తే నాకు సిగ్గుగా అనిపిస్తుందని సమంత పేర్కొన్నారు.
నేను దారుణంగా యాక్ట్ చేశాననే భావన కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలలో ఇంకా బాగా నటించవచ్చు కదా అని అనిపిస్తుందని కానీ వీళ్లు అలా కాదని సమంత తెలిపారు.తొలి సినిమానే అయినప్పటికీ యాక్టింగ్ బాగా చేశారని సమంత అన్నారు.నిర్మాతగా మారడం గురించి కూడా సమంత రియాక్ట్ కావడం గమనార్హం.
లైఫ్ లో సవాళ్లను స్వీకరించడం నాకు ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.నిర్మాతగా ఇది కొత్త ప్రయాణం అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటించిన శుభం సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.సమంత సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్( Tralala Moving Pictures ) పై ఈ సినిమా తెరకెక్కింది.మే నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.సమంత నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.