ఆయుర్వేద వైద్యంలో ఉసిరిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు.చాలా అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఉసిరి మంచి ఔషధంలా పనిచేస్తుంది.
ఎందుకంటే ఉసిరిలో విటమిన్ ఈ, విటమిన్ సి లాంటి ఎన్నో ఔషధాలు ఉన్నాయి.ఉసిరికాయ కేవలం అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా తెల్ల జుట్టుతో బాధపడే వారికి ఉసిరి మంచి ఔషధంలా పనిచేస్తుంది.జుట్టుకు ఉసిరి నీటిని మర్డించడం ద్వారా మీ స్కాల్ప్‌లో మెలనిన్ పెరుగుతుంది.
ఇది తెల్ల జుట్టు సమస్యలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.దీనితో పాటు ఉసిరి నీరు చుండ్రు సమస్యను కూడా దూరం చేస్తుంది.
ఇది మాత్రమే కాకుండా ఉసిరి నీరు మీ జుట్టుకు బలాన్ని మరియు మెరుపును కూడా అందిస్తుంది.వారానికి రెండు సార్లు జుట్టుకు ఆమ్లా నీటిని అప్లై చేస్తే మంచిది.
కాబట్టి జుట్టుకు పెట్టే ఆమ్లా నీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి నీటిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఉసిరి పొడి ఒక టేబుల్ స్పూన్, మూడు పెద్ద కప్పులలో నీరు.ఉసిరిని తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మొదటిగా ఒక పాత్రలో నీటిని తీసుకోవాలి.
ఆ నీటిలో ఉసిరి పొడి వేసి బాగా కలపాలి.ఇనుప పాత్రలో ఈ నీటిని రాత్రంతా ఉంచడం మంచిది.
ఉదయాన్నే ఆ నీటిని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేయాలి.అంతే ఆమ్లనీరు సిద్ధమైపోతుంది.
ఆమ్లా నీటిని జుట్టుకు బాగా మర్దన చేయాలి.ఒక గంట తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
మంచి ఫలితం కోసం మీరు ఈ నీటిని వారానికి రెండు నుంచి మూడుసార్లు ఉపయోగించడం మంచిది.ఇలా చేస్తే అందమైన, నలుపు, బలమైన జుట్టు మీ సొంతమవుతుంది.