చాలామంది తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.అందుకే ప్రతి ఇంట్లోనూ కూడా తులసి మొక్కను నాటుకొని ప్రతి రోజు తులసి మొక్కకు పూజా చేస్తూ ఉంటారు.
తులసికి పూజ చేసి నీళ్లతో నైవేద్యం పెట్టడం వల్ల వాళ్లకు అనేక రకాల అరిష్టాలు తొలగిపోయి ఇంట్లో శుభాలు కలుగుతాయి అని వాళ్ళు చెబుతారు.అయితే తులసి మొక్కలో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి దేవి నివసిస్తున్నారని నమ్ముతారు.
అందుకే తులసి మొక్క వద్ద కొన్ని తప్పనిసరి నియమాలను పాటించడం చాలా అవసరం.ఈ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతారు.ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి సంరక్షించే వారిని లక్ష్మీదేవి కాటాక్షిస్తుందని చెబుతారు.అందుకే అలాంటి తులసి వద్ద కొన్ని వస్తువులు పెట్టకూడదని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క నాటిన ప్రదేశంలో మురికి వేయకూడదు.అదేవిధంగా తులసి మొక్క దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రత పాటించాల్సి ఉంటుంది.అదేవిధంగా రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే చెత్తను కూడా తులసికి చాలా దూరంగా ఉంచాలి.అలాగే తులసి మొక్క దగ్గర చీపురు కట్టను కూడా పెట్టకూడదు.

తులసి దగ్గర చీపురు పెడితే ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుంది.అందుకే తులసి దగ్గర చీపురు కట్టను పెట్టకపోవడం మంచిది.అలాగే తులసి మొక్క దగ్గర బూట్లు, చెప్పులు కూడా పెట్టకూడదు.ఎందుకంటే తులసి మొక్క ఎంతో పవిత్రమైనది.అలాంటి పవిత్రమైన మొక్క దగ్గర మనం కాళ్లకు ధరించే చెప్పులను పెట్టడం మంచిది కాదు.
అందుకే తులసి మొక్కకు కొంచెం దూరంలో బూట్లు చెప్పుల కోసం ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి.
అయితే తులసి మొక్క దగ్గర బూట్లు చెప్పులు పెడితే అనేక సమస్యలు వస్తాయి.అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర ముళ్ళ మొక్కలు నాటకూడదు.
అలా నాటితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ సర్కులేషన్ అవుతుంది.అదేవిధంగా తులసి మొక్క చుట్టూ ముళ్ళు ఉంటే కూడా వెంటనే తీసేయాలి.